Ration KYC : రేషన్ కేవైసీ కోసం బారులు తీరిన ప్రజలు..!

రేషన్ కార్డు మనకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం, పప్పు, తదితర సరుకులు పంపిణి చేస్తుంది. ఈ కార్డు కావాలంటే మీ సేవ ద్వారా వెళ్లి తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రభుత్వ సంబంధించిన సైట్ లో నమోదు చేయాలి. ఇది వరకు చాలా మంది ఈ ప్రక్రియను విజయవంతం చేసుకున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ షాప్ కు వెళ్లి ఇంటికి కావలసిన సరుకులు ప్రభుత్వం ఆద్వర్యంలో తక్కువ ధరలో.. ప్రభుత్వ పథకాల లో ఉచితంగానో మనం ఇంత వరకు తెచ్చుకున్నాం.. మనకు ఇంత వరకు మాత్రమే తెలుసు.. ఎందుకంటే రేషన్ కార్డుతో మనకు అంతకు మించి ఎం పని ఉండదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ చూసినా పిల్లజల్లతో బారులు తీరిన ప్రజలు.. ఎందుకని అడిగితే రేషన్ కార్డులు ఉన్నవాళ్లు కేవైసీ చేసుకోవాలి.. లేదంటే రేషన్ కార్డు రద్దు చేస్తారు. అనే మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

రేషన్ కార్డు.. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ పదం తెగ చక్కర్లు కొడుతుంది. ఏ రేషన్ షాప్ ను చూసిన రేషన్ కార్డులతో బారులుతీరారు ప్రజలు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందా..? ఉన్నపలంగా ఎందుకు ఈ రేషన్ కార్డులు పట్టుకోని ప్రజలు రేషన్ షాపుల ముందు క్యూలో ఉంటున్నారు. అని మీకు ఓ ప్రశ్న తలెత్తుతుంది కాదు.. అయితే ఇది చదివి మీరు వెళ్లిండి మారీ..

రేషన్ కార్డు మనకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం, పప్పు, తదితర సరుకులు పంపిణి చేస్తుంది. ఈ కార్డు కావాలంటే మీ సేవ ద్వారా వెళ్లి తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రభుత్వ సంబంధించిన సైట్ లో నమోదు చేయాలి. ఇది వరకు చాలా మంది ఈ ప్రక్రియను విజయవంతం చేసుకున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ షాప్ కు వెళ్లి ఇంటికి కావలసిన సరుకులు ప్రభుత్వం ఆద్వర్యంలో తక్కువ ధరలో.. ప్రభుత్వ పథకాల లో ఉచితంగానో మనం ఇంత వరకు తెచ్చుకున్నాం.. మనకు ఇంత వరకు మాత్రమే తెలుసు.. ఎందుకంటే రేషన్ కార్డుతో మనకు అంతకు మించి ఎం పని ఉండదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ చూసినా పిల్లజల్లతో బారులు తీరిన ప్రజలు.. ఎందుకని అడిగితే రేషన్ కార్డులు ఉన్నవాళ్లు కేవైసీ చేసుకోవాలి.. లేదంటే రేషన్ కార్డు రద్దు చేస్తారు. అనే మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

అసలెందుకు ఈ కేవైసీ..? 

పౌర సరఫరా శాఖ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా నడుస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పౌర సరఫరా శాఖ మాత్ర కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో.. వాటి ఆదేశాలతో నడుస్తుంది. కావున ఈ కేవైసీ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కాదు. బోగస్ రేషన్ కార్డులను ఏరిపారేసేందుకు.. అసలైన లబ్ధిదారులకు మేలు జరిగేందుకు రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం.

మీ కుటుంబంలో అక్కకో.. చెల్లకో.. పెళ్లి అయ్యాక వారుకి పుట్టింటికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అయిన రేషన్ కార్డుకు సంభందించిన ఏ స్కిమ్ కూడా వారికి వర్తించదు. అయిన వారి పేరుతో వాళ్ల కుటుంబ సభ్యులకు వారికి వచ్చే బియ్యం కూడా తీసుకుటున్నారు. అలాగే వయస్సు పైబడిన వారు, ఏదో ప్రమాదంలో చనిపోయిన వారు ప్రతి కుటుంబం కాకపోయినా ఎవరో ఒకరి కుటుంబంలో ఇలా జరుగుతుంటుంది.. ఒకరు తక్కువ అవ్వడంతో ఆ పేరును మీ రేషన్ కార్డు లో నుంచి తీసేయాలి. కానీ కుటుంబ సభ్యులను వారి పేర్లను అధికారికంగా రేషన్ కార్డు నుంచి తొలగించడం లేదని గుర్తించింది. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు కేవైసీ నమోదును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

పౌర సరఫరా శాఖ పై కేంద్ర ఆగ్రహం.. ఎందుకు..?

దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియను సక్రమంగా జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.. ఆది కాస్త ప్రజల నిత్య జీవన విధానానికి కోసంత ఆందోళన అంతర్యం, మొదలైంది. కేంద్రం ఆదేశాల్లో ప్రతి రాష్ట్రంలోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కేవైసీ పూర్తయితే… నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనేది తేలుతుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరు కచ్చితంగా కేవైసీ పూర్తి చేయాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. రాష్ట్రంలో ఏ ఊళ్లో ఉన్నవారైనా సరే… అక్కడి రేషన్ షాపుకు వెళ్లి కేవైసీ పూర్తి చేసువచ్చని చెప్తున్నారు.

తెలంగాణ పౌర సరఫరా శాఖ.. 

రేషన్ కార్డు లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవైసీ ప్రక్రియ వల్ల రాష్ట్రంలోని లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు గంగుల కమలాకర్ లేఖ రాశారు. గతంలో తెలంగాణకు చెందిన చాలామంది రేషన్ లబ్ధిదారులు బతుకుదెరువు కోసం విదేశాలకు, దూరప్రాంతాలకు వలస పోయారని.. వీరంతా వచ్చి కేవైసీ చేయించుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కేవైసీని కచ్చితం చేయడం వల్ల వీరంతా నష్టపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. కేవైసీ నిర్ణయాన్ని పున‌:సమీక్షించాలని కోరారు. కేవైసీతో కలిగే ఇబ్బందు లపై ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల ప్రయోజనాలను కచ్చితంగా కాపాడుతుందని భరోసా ఇచ్చారు.

కేంద్ర అనాలోచిత నిర్ణయం..
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు..

రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారంతా కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకతను సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  • కేవైసీ ఎలా చేయించుకోవాలి..?
  • ఎక్కడ చేయించుకోవాలి ?
  • ఎప్పటిలోగా చేయించుకోవాలి ?
  • వేలిముద్రలు పడకపోతే ఏమి చేయాలి ?
    తదితర అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో రేషన్ కార్డుదారులు అయోమయానికి గురవుతున్నారు. కార్డుల్లో పేర్లు ఉన్న వారిలో ఒక్కొక్కరు ఒక్కో చోట ఉన్నారు. బతుకు దెరువు కోసం గల్ఫ్, ముంబైయి, దుబాయ్ వంటి దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పుడు ఉన్నపలంగా ఈ ప్రక్రియకై దేశానికి రావడం చాలా కష్టం. ఇప్పుడు వీరంతా కేవైసీ కోసం తిరిగి దేశానికి రావాలా ? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మరో వైపు కార్డుల్లోని చిన్న పిల్లల వేలిముద్రలు సరిపోవడం లేదు. ఆధార్ నమోదు సమయంలో చిన్నపిల్లల వేలిముద్రలు గానీ ఐరిస్ గానీ తీసుకోరు. ఇప్పుడు వారిని ఏవిధంగా కేవైసీ చేయాలో తెలియక తల్లిదండ్రులు, రేషన్ షాప్ దారులు తలపట్టుకుంటున్నారు. ఒకవేళ కేవైసీ చేయించుకోని పక్షంలో కార్డు నుంచి పేరు తొలగిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. కేవైసీ ప్రక్రియ పూర్తిగా కేంద్రం ఆదేశాలతో చేసున్నదే తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని అధికారులు చెప్తున్నారు.

కేవైసీకి గడువు ముగిసిందా..? డెడ్  లైన్ అంటూ ఉందా..?

రేషన్‌ కార్డు కేవైసీకి సెప్టెంబర్‌ 30తో అయిపోయిందని.. కేవైసీ చేయించుకోని వారికి రేషన్‌ కార్డులు తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో రేషన్‌ కార్డు లబ్దిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. రేషన్‌ కార్డు కేవైసీ ప్రక్రియ కొనసాగుతుందని.. కేవైసీ పై కీలక సమాచారం వెల్లడించింది.. కేంద్ర ప్రభుత్వం.. కేవైసీని పూర్తిచేసుకునేందుకు ఎలాంటి గడువు పెట్టలేదని స్పష్టం చేసింది. తుది గడువు విధించారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేస్తు అసత్య ప్రచారాన్ని కొట్టి పరేసింది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని రేషన్‌ వినియోగదారులకు ప్రభుత్వాలు సూచించింది. కేవైసీ చేయించుకోకపోతే.. కార్డులో పేరు తీసేస్తారన్నది పూర్తిగా అబద్ధపు ప్రచారమే అని కొట్టిపారేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.డెడ్ లైన్ లేదు అని ఉండకుండా.. సమయం కల్పించుకొని కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రేషన్ డీలర్ల ద్వారా ప్రభుత్వం సూచించింది.

S.SURESH