JAGAN : జగన్ కి గట్టి షాకిచ్చిన మోడీ

ఏపీలో కూటమి పరిపాలన అరాచకంగా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ ఢిల్లీలో జగన్ ధర్నాకు సిద్ధమవుతున్నారు. ఇదే టైమ్ లో ప్రధాని నరేంద్రమోడీ ఊహించని షాక్ ఇచ్చారు.

ఏపీలో కూటమి పరిపాలన అరాచకంగా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ ఢిల్లీలో జగన్ ధర్నాకు సిద్ధమవుతున్నారు. ఇదే టైమ్ లో ప్రధాని నరేంద్రమోడీ ఊహించని షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు తాము అండగా నిలుస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించి. పరోక్షంగా కూటమి పాలనకు కితాబిచ్చారు మోడీ. ఇప్పుడు జగన్ ఢిల్లీలో ఎంత అరచి గీ పెట్టినా… కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేనే లేదని అర్థమవుతోంది.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు మంత్రి నిర్మలా సీతారామన్… అవసరమైతే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమన్నారు. ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు మరికొన్ని జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీని కూడా అనౌన్స్ చేశారు. పోలవరం పూర్తి చేయడానికి సహకారం అందిస్తామంది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలిపిన అన్ని అంశాలను అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పడం…ఏపీ సీఎం చంద్రబాబుకు పెద్ద బూస్టింగ్. ఈ ప్రకటనలతో ఏపీలో ప్రభుత్వ పాలన సక్సెస్ అయ్యేందుకు కేంద్రం మద్దతు ప్రకటించినట్టు అయింది. గత NDA ప్రభుత్వానికి అన్ని విధాలా వైసీపీ మద్దతు ఇచ్చినా… ఈ రేంజ్ లో నిధులు తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తేవాలని ఢిల్లీలో ధర్నా పెట్టుకున్న టైమ్ లోనే కేంద్ర ప్రభుత్వం ఊహించని రీతిలో నిధులు ప్రకటించింది. దాంతో జగన్ పరిస్థితి కక్కా మింగలేక అన్నట్టు తయారైంది. ప్లాన్ బూమరాంగ్ అవడమే కాదు… జగన్ కి ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.