భారతదేశం.. మిస్టరీల ప్రదేశం. సైన్స్‌కి అంతుబట్టని ఎన్నో వింతలు, రహస్యాలు… మన దేశంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పురాతన ఆలయాలు.. అక్కడ ఉండే మహిమాన్విత విగ్రహాలు… వాటి ఆధారంగా జరిగే వింతలు… ఎవరికీ అంతుచిక్కవు. అది దేవుడి మహిమేనా..? లేక.. ఇంకేదైనా కారణమా..? అన్న అనుమానాలు నివృత్తి చేసేదెవరు..? అలాంటి అంతుచిక్కని రహస్యాలను దాచుకున్న ఓ అద్భుత ఆలయం తమిళనాడులో ఉంది. అక్కడి వినాయకుడి విగ్రహం ఆరు నెలలకు ఒకసారి రంగు మారుతుంది. ఆ ఆలయం విశేషాలు.. అక్కడ జరిగే మిరాకిల్స్ గురించి తెలుసుకుందాం.
ఆదిశయ వినాయకర్ ఆలయం… ఇదే ఆ ఆద్భుత ఆలయం. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కేరళపురంలో ఉంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. అయితే… ఆలయాన్ని నిర్మించేందుకు చాలా కాలం ముందే విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయట. ఇక్కడ శివుడు, వినాయకుడి ఆలయాలు ఉంటాయి. ప్రధానాలయం శివాలయం అయినా… వినాయకుడికే ప్రాముఖ్యత ఎక్కువ. ఎందుకంటే… ఇక్కడి వినాయకుడి విగ్రహమే ఒక మిరాకిల్. ఆరు నెలలకు ఒకసారి రంగు మారుతూ ఉంటుంది. ఇలా ఎక్కడా ఉండదు… ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఉత్తరాయణ కాలంలో అంటే.. మార్చి నుంచి జూన్ వరకు… వినాయకుడి విగ్రహం నల్లని రంగులో కనిపిస్తుంది. దక్షిణాయణ కాలంలో అంటే.. జులై ఉంచి ఫ్రిబవరి వరకు.. తెల్లని రంగులోకి మారిపోతుంది. ఇది చూసిన భక్తులు… అంతా దేవిడి మహిమ అంటూ… భక్తితో నమస్కారం చేసుకుంటారు. ఇలా విగ్రహం రంగులు మార్చుకోవడం వల్ల… ఈ ఆలయాన్ని మిరాకిల్ గణేష్ టెంపుల్ అని కూడా పిలుస్తారు.
విగ్రహం రంగులు మారడమే కాదు.. ఆ ఆలయంలో మరో వింత కూడా ఉందండి. అదేంటంటే.. ఆలయ ప్రాంగణంలో ఒక బావి ఉంది. ఆ బావిలోని నీరు కూడా ఆరు నెలలకు ఒక సారి రంగు మారుతుంది. సాధారణంగా నీటికి రంగు ఉండదంటారు. కానీ… ఇక్కడ బావిలోని నీరు మాత్రం ఆరు నెలలకు ఒకసారి రంగు మారుతుంది. వినాయకుడి విగ్రహం నల్లగా ఉన్నప్పుడు.. బావిలోని నీరు తెల్లగా ఉంటుంది. విగ్రహం తెల్లగా ఉన్నప్పుడు… బావిలోని నీరు నల్లగా కనిపిస్తుంది.
అంతేకాదు… మరో అద్భుతం కూడా ఈ ఆలయంలో కనిపిస్తుంది. సాధారణంగా శిశిర ఋతువు అంటే మాఘ, పాల్గుణ మాసాల్లో చెట్లు ఆకులు రాలి.. వసంతరుతువులో చిగురిస్తాయి. కానీ కేరళ, తమిళనాడులోని ఉష్ణమండల ప్రాంతాల్లో… ఈ నియమం ఉండదు. అక్కడ చెట్లు ఎప్పుడూ పచ్చగానే ఉంటాయి. అయితే… ఆదిశయ వినాయకర్ ఆలయంలో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుంది. ఆ ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు దక్షిణాయణ కాలంలో అంటే.. జులై ఉంచి ఫ్రిబవరి వరకు ఆకులు రాలుస్తుంది. ఉత్తరాయణ కాలంలో అంటే.. మార్చి నుంచి జూన్ వరకు చిగురిస్తుంది. ఇది నిజంగా వింతే.
ఆదిశయ వినాయకర్ ఆలయంలో ఇలా ఎన్నో అద్భుతాలు.. ఒక్కొక్కటి ఒక్కో వింత. వినాయకుడి విగ్రహం… ఆరు నెలలకు ఒకసారి రంగు ఎందుకు మారుతుందో..? అక్కడి బావిలోని నీరు… విగ్రహ రంగులకు విరుద్దంగా.. రంగులు ఎలా మారుస్తుందో…? చిగురించాల్సిన సమయంలో… మర్రిచెట్టు… ఆకులను ఎలా రాలుస్తుందో..? వీటిలో ఒక్కదానికి కూడా స్పష్టమైన కారణాలు లేవు..? అన్నీ మిస్టరీలే..! చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అందుకే ఇదంతా… వినాయకుడి మహిమ అని నమ్ముతారు భక్తులు.