India vs Australia : కప్పు ముఖ్యం బిగిలూ… మరో వరల్డ్ కప్ పై యువ భారత్ కన్ను

అండర్19 వరల్డ్ కప్ ఫైన (Under-19 World Cup Final) ల్ పోరుకు అంతా సిద్దమయింది. టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ , ఆస్ట్రేలియా (Australia)తో తలపడబోతొంది. సీనియర్‌ జట్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు.. యువ కంగారూ జట్టును ఓడించి కప్పును ముద్దాడేందుకు భారత కుర్రాళ్లు సై అంటున్నారు.

అండర్19 వరల్డ్ కప్ ఫైన (Under-19 World Cup Final) ల్ పోరుకు అంతా సిద్దమయింది. టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ , ఆస్ట్రేలియా (Australia)తో తలపడబోతొంది. సీనియర్‌ జట్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు.. యువ కంగారూ జట్టును ఓడించి కప్పును ముద్దాడేందుకు భారత కుర్రాళ్లు సై అంటున్నారు. ఆరోసారి కప్పు గెలవాలని పట్టుదలగా ఉన్న యువ భారత్ ఫైనల్ పోరులో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఫైనల్‌ చేరే క్రమంలో మన కుర్రాళ్లు అత్యుత్తమ ఆటతీరుతో అదరగొట్టేశారు. అదే సంకల్పంతో ఆడితే మరోసారి టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఈ టోర్నీ చరిత్రలో రెండు సార్లు ఆస్ట్రేలియాను ఓడించి భారత్‌ కప్పు సొంతం చేసుకుంది. ఇది భారత్‌కు వరుసగా అయిదో ఫైనల్‌. యువ భారత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. మంచి బ్యాటర్లతో, నాణ్యమైన బౌలర్లతో నిండిన మన జట్టు నిలకడగా రాణిస్తోంది. గ్రూప్‌లో, సూపర్‌ సిక్స్‌ దశలో, సెమీస్‌లో సత్తాచాటిన భారత్‌ అజేయంగా ఫైనల్‌ చేరింది. కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ మంచి ఫామ్ లో ఉన్నాడు. మరోవైపు బౌలింగ్‌లో స్పిన్నర్‌ సౌమి పాండే , పేసర్‌ నమన్‌ తివారి కీలకం కానున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియా యువ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టు కూడా భారత్ లానే ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ చేరింది. కెప్టెన్‌ హ్యూ విబ్జెన్‌, ఓపెనర్‌ హ్యారీ డిక్సన్‌, పేసర్లు టామ్‌ స్ట్రాకర్‌, కలం విడ్లర్‌ ఆ జట్టులో ప్రధాన ఆటగాళ్లు. ఆసీస్ పేస్ ఎటాక్ ను తట్టుకుని భారత కుర్రాళ్లు నిలబడితే మన జట్టుకు తిరుగుండదు. ఇప్పటివరకూ భారత్‌ 5 సార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ (under 19 world cup final) గెలిచింది. 2000, 2008, 2012, 2018, 2022లో జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.