Tamil Nadu : తమిళనాడులో గంటగంటకు పెరుగుతున్న కల్తీ మద్యం మృతులు.. 55కు చేరిన మృతుల సంఖ్య

గత కొన్ని రోజులుగా.. తమిళనాడులో కల్తీ మధ్యం తాగి దాదాపు 40 మృతి చెందారు. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

గత కొన్ని రోజులుగా.. తమిళనాడులో కల్తీ మధ్యం తాగి దాదాపు 40 మృతి చెందారు. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 15 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 55కు చేరుకుంది. కల్లకురిచి ప్రభుత్వాసుపత్రిలో 30 మంది, ముదియాపాక్కమ్ ప్రభుత్వాసుపత్రిలో నలుగురు, సలేమ్ ప్రభుత్వాసుపత్రిలో 18 మంది, పాండిచ్చేరిలో జిప్‌మర్ హాస్పిటల్‌లో ముగ్గురు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఇంకా వివి ఆస్పత్రుల్లో 100 మంది చావుబతుకు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరికొంద మంది కల్తీ మధ్యం తాగడంతో వారి కంటిచూపు కోల్పోయారు.

దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరో వైపు ఈ ఘటనకు కారకులైన వారిని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధ్యులను పట్టుకోని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం పోలీసులు ఆదేశించింది.