భారతదశంలో ప్రదానంగా రెండు నగరాల్లో యూజ్డ్ కార్ల క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో హైదరాబాద్, బెంగళూరు ముందు వరుసలో ఉంది. 2022-23లో దేశ వ్యాప్తంగా 50 లక్షల సెకండ్ హాండ్ కార్లు చేతులు మారాయి. ఇందులో ఒక సంస్థ ద్వారా అమ్ముడుపోయినవి 30 శాతం కాగా., ఏ సంస్థకు సంబంధం లేకుండా విక్రయం జరిగినవి 70 శాతంగా గుర్తించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ పరిశ్రమ గతంలోని 50 లక్షల యూనిట్లకు 15 లక్షల యూనిట్ల పెరుగుదలతో 65 లక్షల యూనిట్లకు చేరనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే ఎనిమిది శాతం వాటా ఉన్నట్లు తెలుస్తుంది. ట్రేడ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి పాత కార్ల వినియోగం కొత్త కార్ల కొనుగోలు కంటే రెట్టింపు ఉండే అవకాశం ఉంది. మొట్టమొదటిగా కారు కొనుగోలు చేయాలకున్న వాళ్లలో 70 శాతం మంది పాతకార్ల వైపుకే అడుగులు వేస్తున్నారు.
వ్యవస్థీకృత రంగానిదే పై చేయి
ఈ సెకండ్ హ్యాండ్ కార్లను కేవలం వ్యవస్థీకృత రంగమే ఎక్కువగా నడుపుతోందని కార్స్ 24 సంస్థకు చెందిన కో ఫౌండర్, చీఫ్ మార్కెటింగ్ అధికారి గజేంద్ర జంగిద్ తెలిపారు. గతంలో ఏ సంస్థ ప్రమేయం లేకుండా కొనేవారు అధికంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం ఈ అవ్యవస్థీకృతరంగం ద్వారా కొనుగోలు జరిగేవి కేవలం 10 శాతం మాత్రమే అని చెబుతున్నారు నిపుణులు. అదే వ్యవస్థీకృత రంగం ద్వారా అయితే 30 శాతం క్రయ విక్రయాలు జరుగుతుందని చెబుతున్నారు.
సెకండ్ హ్యాండ్ కార్లే ఎందుకు కొంటున్నారో తెలుసా..
కొత్త కారు కొనాలంటే లోను అవసరం. కారు కొనేంత బడ్జెట్ అందరి దగ్గర ఉండకపోవచ్చు. కొందరు ఉన్నప్పటికీ ట్యాక్స్ కారణంగా కొనుగోలు చేయరు. పైగా ఇప్పట్లో లోను తీసుకొని వాటికి అధికంగా వడ్డీలు చెల్లించడం అంటే మాటలు కాదు. అందులోనూ సెకండ్ హ్యాండ్ కారు కు లోను కూడా ఆశించినంత రుణం ఫైనాన్సియల్ సంస్థలు ఇవ్వవు. ఇక పోతే ఈ మధ్య కాలంలో సర్టిఫైడ్ కార్లకు విలువ అమాంతం పెరిగింది. కారు ఇంజన్ క్వాలిటీ చెక్ చేస్తున్నారు. పైగా ఇన్నేళు వారంటీ అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారికి ఈజీ ఫైనాన్స్ అందించేందుకు ముందుకు వస్తున్నారు. వీటన్నింటితో పాటూ రిటర్న్ పాలసీ కూడా అందిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తుండటంతో సర్టిఫైడ్ కార్లపై వినియోగదారులకు నమ్మకం ఏర్పాడింది. పైగా యావరేజ్ రూ. 6 లక్షలకే మంచి కండీషన్ లో ఉండే కార్లు అందుబాటులో ఉంచడం వీటి విక్రయాల పరిధి పెరిగేందుకు తోర్పడుతుంది.
పార్కింగ్ విధానం
పార్కింగ్ విధానం అంటే మనం అమ్మాలనుకున్న వాహనాన్ని ఏదైనా సెకండ్ హ్యాండ్ సంస్థ వద్దకు తీసుకెళ్ళాలి. అక్కడ కొంత డబ్బులు చెల్లింస్తే పార్కింగ్ సౌకర్యం కల్పిస్తారు. ఇలా మన కారును అక్కడ కొన్ని రోజుల పాటూ పార్కింగ్ లో ఉంచితే అవసరమైన వాళ్లు కారు కొనుగోలుకు వస్తూ ఉంటారు. అప్పుడు మన కారు అక్కడి పార్కింగ్ లో ఉంటుంది కనుక మంచి ధర వస్తే అమ్మేస్తారు. ఆ తరువాత కార్ల విక్రయాలు జరిపిన సంస్థకు కొంత కమీషన్ ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతం మన దేశంలో బెంగళూరు, హైదరాబాద్ లోనే పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. 2015 లో 100 కొత్త కార్లు రోడ్డుపైకి వస్తే.. పాత కార్లు కూడా అంతే స్థాయిలో బయటకు వచ్చేవి. కానీ ప్రస్తుతం అలా కాదు. అమెరికాతో పాటూ ఇతర అభివృద్ది చెందిన దేశాల్లో 100 కొత్త కార్లు రోడ్డుపైకి వస్తే 400 సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు జరుగుతోంది. అంటే కొత్త కారు కొనేవారికంటే పాత కారును కొనాలనుకునే వారి సంఖ్య దాదాపు నాలుగు రెట్టు పెరిగింది.
T.V.SRIKAR