రేప్ టైంలో తొడపై భారీ గాయాలు చేసిన డాక్టర్

ఆర్‌ జి కర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్య కేసులో సిబిఐ దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 25, 2024 / 02:43 PM IST

ఆర్‌ జి కర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్య కేసులో సిబిఐ దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటన జరిగిన ప్రదేశంలో సిబిఐ అధికారులు మొత్తం 53 వస్తువులను స్వాధీనం చేసుకోగా అందులో 9 వస్తువుల్లో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు సంబంధించిన నమూనాలు ఉన్నాయని గుర్తించారు. అలాగే సంజయ్ రాయ్‌కు ఆదివారం పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అయితే లై-డిటెక్టర్ పరీక్షకు ముందు, నిందితుడు తనను ఇరికించారని తనకు ఏ పాపం తెలియదని అనడం సంచలనంగా మారింది.

అత్యాచారం మరియు హత్య గురించి తనకు ఏమీ తెలియదని సంజయ్ రాయ్ జైలు అధికారులతో చెప్పినట్టు జాతీయ మీడియా పేర్కొంది. తాను ఏ పాపం చేయలేదు కాబట్టి లై డిటెక్టర్ టెస్ట్ కి ఓకే చేసాను అని చెప్పాడట. శనివారం, కొన్ని సాంకేతిక కారణాల వల్ల సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్ష వాయిదా పడింది. ఆదివారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.. మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, మరో నలుగురు వైద్యులు సహా ఆరుగురికి శనివారం లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. అలాగే 10 మంది పోలీసు అధికారులను కూడా సిబిఐ అధికారులు విచారించారు.

ఇప్పుడు అతని శరీరంపై ఉన్న గాయాలపై సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణలో అతని తొడ భాగం, వీపు భాగం, పొట్టపై ఉన్న గాయాలను సిబిఐ అధికారులు గుర్తించారు. వాటి గురించి అడిగితే సంజయ్ రాయ్ ఏ సమాధానం చెప్పలేదు. దీనిపై సిబిఐ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. అతను అత్యాచారం చేసే సమయంలో బాధితురాలు ఏ స్థాయిలో ప్రతిఘటించింది అనడానికి ఆ గాయాల తీవ్రత ఉదాహరణ అని, ఆ గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయని సిబిఐ అధికారులు పేర్కొన్నారు. ఆ గాయాలకు సంబంధించి వైద్యులతో పరిక్షలు నిర్వహించనున్నారు.