National General Elections : దేశవ్యాప్తంగా మూగబోయిన ఎన్నికల ప్రచారం.. ధ్యానంలోకి వెళ్లిన దేశ ప్రధాని మోదీ..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచారం ముగిసింది. జూన్-1న ఏడో దశ పోలింగ్ పూర్తయితే.. ఇక నేడు దేశవ్యాప్తంగా ప్రచార రథాలు అగిపోయాయి. ప్రచార మైకులు మూగబోయాయి. దీంతో అన్ని పార్టీల ముఖ్యనాయకులు తమ ప్రచారాలు ముగించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు.

 

 

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచారం ముగిసింది. జూన్-1న ఏడో దశ పోలింగ్ పూర్తయితే.. ఇక నేడు దేశవ్యాప్తంగా ప్రచార రథాలు అగిపోయాయి. ప్రచార మైకులు మూగబోయాయి. దీంతో అన్ని పార్టీల ముఖ్యనాయకులు తమ ప్రచారాలు ముగించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఎక్కడ ఎన్నికలుంటే ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ తరుణంలో ప్రధాని మోదీ సైతం తన ప్రచారాన్ని ముగించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన దేశవ్యాప్తంగా 200 సభలు, 80 ఇంటర్వ్యూలో పాల్గొనడం విశేషం.

7వ విడత పోలింగ్ జరిగే రాష్ట్రాలు ఇవే..

జూన్ 1న చివరి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్లో 8 రాష్ట్రాల్లో 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ -13, పంజాబ్ -13, బెంగాల్ -9, బీహార్-8, ఒడిశా- 6, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్ -3 స్థానాలు, చండీగఢ్ ఒక లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగనుంది 57 ఎంపీ స్థానాలకు బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు ఉన్నారు. జూన్ 1తో 7 దశల పోలింగ్ ముగియనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మొత్తం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

ఆధ్యాత్మిక ధ్యానంలోకి ప్రధాని మోదీ..

ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాని మోదీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మోదీ తమిళనాడులోని వివేకానంద రాక్ మెమోరియల్‌ కి వస్తారు. కన్యాకుమారి లో 48 గంటలు ఆయన ఆధ్యాత్మిక ధ్యానంలో పాల్గొంటారని సమాచారం..