మూడోరోజూ ఆట రద్దు బీసీసీఐ ఆడుకుంటున్న ఫ్యాన్స్

కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్ డ్రాగా ముగియడం ఇక లాంఛనమే..మూడో రోజు ఆట కూడా ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. వర్షం లేకున్నా.. మైదానంలోని ఓవైపు ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు చివరకు మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - September 29, 2024 / 06:16 PM IST

కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్ డ్రాగా ముగియడం ఇక లాంఛనమే..మూడో రోజు ఆట కూడా ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. వర్షం లేకున్నా.. మైదానంలోని ఓవైపు ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు చివరకు మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.గ్రౌండ్ స్టాఫ్ నీటిని తొలగించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు నిరాశగా మైదానాన్ని వీడారు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో 55 ఓవర్లు మింగేసిన వరణుడు.. రెండో రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడనివ్వలేదు. మూడో రోజు ఆట కూడా రద్దవ్వడంతో మిగిలిన రెండు రోజుల్లో ఫలితం వచ్చే అవకాశాలు దాదాపు అసాధ్యమే.

కాన్పూర్ లో రెండోరోజు మధ్యాహ్నం, మూడోరోజు వర్షం లేకున్నా మైదానం రెడీ కాకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోట్ల రూపాయాల ఆదాయం ఉన్న బీసీసీఐ.. మైదానాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. మైదానాలను చక్కదిద్దడంలో అలసత్వం ప్రదర్శిస్తోందనిని విమర్శిస్తున్నారు. గెలవాల్సిన మ్యాచ్ డ్రాగా ముగిస్తున్నందుకు బీసీసీఐదే బాధ్యత అంటూ ఫైర్ అవుతున్నారు.