Badrinath : రేపు బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.

ఉత్త‌రాఖండ్‌లో నాలుగు పుణ్య‌క్షేత్రాల‌కు నెలవయిన చార్‌ధామ్‌లో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంది. హిమాల‌యాల కార‌ణంగా రోజూ మంచు కురుస్తుండ‌టంతో చార్‌ధామ్ ప‌రిస‌రాల‌న్నీ ఆహ్లాద‌క‌రంగా మారిపోయాయి. బ‌ద్రీనాథ్ ఆల‌యంపై మ‌ల్లెలు చ‌ల్లిన‌ట్లుగా మంచు వ‌ర్షం కురుస్తూ క‌నువిందు చేస్తున్న‌ది. ఆ ముగ్ధ మ‌నోహ‌ర‌మైన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించ‌వ‌చ్చు. గత ఏడాది నవంబర్ నెలలో మూతబడిన బద్రినాథ్ ఆలయ తిరిగి నాలుగు నెలల తర్వత రేపు ఉదయం ( ఫిబ్రవరి 14 ) 10 గంటలకు వేదమంత్రాలతో.. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరవనున్నారు ఆలయ అర్చకులు. ఇక ఇన్ని రోజులు మంచులో కూరుకుపోయిన బద్రినాథ్ ఆలయ చిత్రాలు మీకోసం

1 / 23

బద్రినాథ్ ఘాట్ రోడ్డులో పేరుకుపోయిన మంచు..

2 / 23

4 నెలలుగా మంచులో ఉన్న శ్రీమహా విష్ణు భద్రినాథ్ ఆలయం

3 / 23

బద్రినాథ్ ఆలయం.. భారత రెండవ గ్రామం

4 / 23

మంచుతో కప్పబడిన బద్రినాథ్ ఆలయం

5 / 23

బద్రినాథ్ గ్రామం

6 / 23
7 / 23

మంచుతో కప్పబడిన బద్రినాథ్ ఆలయం

8 / 23
9 / 23

అలకనంద నది

10 / 23

మంచు వర్షంలో గలగల పారుతున్న అలకనంద నది

11 / 23

గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచు

12 / 23

బద్రీనాథ్ ఆలయ ప్రతేకత.. ఇవే

13 / 23

బద్రీనాథ్ ఆలయం ఓ పురాణ కథనం

14 / 23

జగత్ గురు ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురం చెప్తుంది.

15 / 23

ఈ ఆలయంలో ఉన్న బద్రినాథ్ విగ్రహాలు.. ఆలయ కింద ఉన్నటువంటి వేడి నీళ్ల గుండం తప్త కుండ్ లభ్యం అయ్యినట్లు స్థల పూరణం చెప్తుంది.

16 / 23

17వ శతాబ్దంలో గర్హ్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది.

17 / 23

1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిథిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది.

18 / 23

బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు ఉంటుంది.

19 / 23

ఆ ఆలయాన్ని ప్రతి సంవత్సరం 6,00,000 భక్తులు సందర్శించినట్లు ఆలయ కమీటి చేస్తుంది.

20 / 23

బద్రీనాథ్ చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది.

21 / 23

ఉత్త‌రాఖండ్‌లో నాలుగు పుణ్య‌క్షేత్రాల‌కు నెలవయిన చార్‌ధామ్‌లో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా.. భారీ హీమపాతంతో.. మంచులో కురుకుపోయి ఉన్నాయి.

22 / 23

హిమాల‌యాల కార‌ణంగా రోజూ మంచు కురుస్తుండ‌టంతో చార్‌ధామ్ ప‌రిస‌రాల‌న్నీ ఆహ్లాద‌క‌రంగా మారిపోయాయి.

23 / 23

ఈ ఆలయం రేపు ( ఫిబ్రవరి 14 ) న ఉదయం 10 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు.