KAPULU ON PAVAN : పవన్ కళ్యాణ్ పై రగులుతున్న కాపులు.. పల్లకి మోసే బోయిలు చేశాడని ఆగ్రహం

అందరూ ప్యాకేజ్ స్టార్.. ప్యాకేజ్ స్టార్.. అంటే ఏదో ప్రచారం కోసం అబద్ధాలు చెబుతున్నారు లే అనుకున్నాం. కానీ ఎన్నికలు ఎప్పుడైనా సరే.. చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి అని లోకేష్ కరాకండిగా చెప్పిన తర్వాత.. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అర్థమైంది.

 

అందరూ ప్యాకేజ్ స్టార్.. ప్యాకేజ్ స్టార్.. అంటే ఏదో ప్రచారం కోసం అబద్ధాలు చెబుతున్నారు లే అనుకున్నాం. కానీ ఎన్నికలు ఎప్పుడైనా సరే.. చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి అని లోకేష్ కరాకండిగా చెప్పిన తర్వాత.. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అర్థమైంది. ఈ మాట అంటున్నది ఎవరో కాదు ఏపీలో చాలామంది కాపులు ఇప్పుడు అదే అభిప్రాయంతో ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. పొత్తులున్నా.. ఎవరు ఎలా అనుకున్నా.. జనసేన టిడిపి కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంగా చెప్పాడు లోకేష్. అంతేకాదు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు అనే విషయాన్ని బయట పెట్టాడు.

ఈ స్టేట్మెంట్ పైనే ఏపీలో కాపులంతా రగిలిపోతున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని కాపుల్ని బలి పశువులు చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల సంఘాల మీటింగ్ లోను, వాట్సాప్ గ్రూపులోనూ లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ పైనే చర్చ జరుగుతోంది. రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు ఎన్నికలు అయిన తర్వాత రెండు పార్టీల అధ్యక్షులు కూర్చొని ముఖ్యమంత్రి ఎవరు అన్నది నిర్ణయించాలి తప్ప.. ఇలా వన్ సైడ్ గా చంద్రబాబు సీఎం అని టిడిపి ఎలా ప్రకటించుకుంటుందని కాపులు నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుతో, లోకేష్ తో లోపాయికారీ ఒప్పందం లేకపోతే అసలు ఎందుకు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేసారని కాపులు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కాపులు జన సేనకి, టీడీపీకి ఓటేయాలా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానప్పుడు.. కాపులు వాళ్ల వాళ్ల వ్యక్తిగత ఇష్టాల్ని పక్కనపెట్టి జనసేనకు టీడీపీకి ఎందుకు ఓటేయాలి అన్నది వారి వాదన. మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా కాపులకు బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని నిండా ముంచేసాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులు తమ ఉనికి కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హరి రామ జోగయ్య తన లేఖలో కోరారు. మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా ఇదే భావనలో ఉన్నారు. లోకేష్ ప్రకటన ఆశ్చర్యం కలిగించలేదనీ.. రేపు జరిగేది అతను ఈ రోజే చెప్పాడని జనసేన – టీడీపీ పొత్తుల్లో కాపులు బలి పశువులు అవుతారనీ.. అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో కనీస ధర్మం కూడా పాటించకుండా ఎన్నికల జరగక ముందే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవడం ద్వారా.. కమ్మ కుల ఆదిపత్యాన్ని స్పష్టంగా చెప్పుకున్నారనేది కాపుల ఆవేదన. లోకేష్ ప్రకటనపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం మరింత బాధాకరంగా ఉందనేది మరికొందరు కాపు నాయకుల వాదన.