Jahnavi: జాహ్నవి చనిపోతే నవ్వింది అందుకే.. ఛీఛీ.. అధికారి సిగ్గులేని క్లారిటీ !

అమెరికాలో జరిగిన యాక్సిడెంట్‌లో తెలుగు స్టూడెంట్‌ జాహ్నవి చనిపోగా.. అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 03:23 PM IST

అమెరికాలో జరిగిన యాక్సిడెంట్‌లో తెలుగు స్టూడెంట్‌ జాహ్నవి చనిపోగా.. అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. ఐతే ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని.. ఆ పోలీసు అధికారి వివరణ ఇచ్చుకున్నాడు. ఈ వివాదానికి కారణమైన అధికారికి.. సియాటెల్‌ పోలీసు విభాగం మద్దతుగా నిలిచింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి.. ఈ ఏడాది జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని చనిపోయింది. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఈ మధ్య వైరల్ అయింది.

ఆమె ఓ కామన్‌ పర్సన్‌… ఈ మరణానికి వ్యాల్యూ లేదు అ్నట్లుగా ఆ అధికారి మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయ్. అటు భారత్‌ కూడా ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో డేనియల్‌పై.. ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ వివాదంపై సియాటెల్‌ పోలీసు అధికారుల గిల్డ్‌ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. వైరల్‌ అయిన విజువల్స్‌ బాడీక్యామ్‌ వీడియో రికార్డ్‌ చేసినవని.. ఐతే ఆ మాటల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చిందని.. అందులో ఇంకా చాలా వివరాలున్నాయని.. అది జనాలకు తెలియదంటూ కవర్‌ చేసుకున్నారు.

పూర్తి డీటెయిల్స్ తెలియక పోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా ఫెయిల్ అయిందంటూ అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్‌ ప్రకటన చేసింది. గిల్డ్‌కు డేనియల్ ఓ లేఖ రాశాడు. లాయర్లను ఉద్దేశిస్తూనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు డేనియల్‌ అందులో తెలిపాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోర్డులో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వానని అన్నాడు. అంతే తప్ప బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చాడు. పూర్తి వివరాలు తెలియకపోతే.. ఇలాంటి భయానక ఊహాగానాలే వైరల్‌ అవుతాయని అన్నాడు. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, ఉన్నతాధికారులు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని క్లారిటీ ఇచ్చాడు డేనియల్.