Aarti Chabria : 41ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ లేటు వయసులో తల్లి అవుతున్నారు. బేబీ బంప్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌గా మ‌రో హీరోయిన్ బేబీ బంప్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ లేటు వయసులో తల్లి అవుతున్నారు. బేబీ బంప్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌గా మ‌రో హీరోయిన్ బేబీ బంప్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నాలుగు పదుల వయసులో ఆ బేబీ బంప్ ఫోటోలతో షాకిచ్చింది. ఆమె ఎవరో కాదు… టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చబ్రియా.తెలుగు, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మ‌డు. 41ఏళ్ల వయసులో ప్రగ్నెంట్ అయిన ఈ హీరోయిన్
ఫొటోలు.. ప్రస్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.

ముంబై భామ ఆర్తి చబ్రియా బాలీవుడ్ లో లజ్జ, ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, మిలేంగే మిలేంగే.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి – గోడమీద పిల్లి.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. తెలుగులో కూడా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది. ఈమె నటించిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. కానీ ఆమెకు మాత్రం మంచి ఛాన్సులు రాలేదు.

దీంతో.. ఆర్తి చబ్రియా 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారద్ బీడస్సిని వివాహం చేసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆర్తి చబ్రియా ఆస్ట్రేలియాలోనే ఉంటూ అప్పుడప్పుడు ముంబై వస్తుంది. రెండు రోజుల క్రితమే ఆర్తి చబ్రియా తన సోషల్ మీడియాలో బేబీ బంప్ తో ఉన్న ఓ వీడియో పోస్ట్ చేసింది. తాను ప్ర‌గ్నెంట్ అంటూ చెప్పుకొచ్చింది. ఆర్తి చబ్రియా బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవ్వడంతో పలువురు ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.