IMD : భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ .

మరో రెండు, మూడు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు (నవంబర్ 15న)తేదీ నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.