Escalator Ban ఎస్కలేటర్ ఈ పేరు ఈ జనరేషన్ యువతకు చాలా పరిచయం ఉన్న పదం. ఎస్కలేటర్ ను చాలా వరకు రైల్వేస్టేషన్లో, విమానాశ్రయంలో ఉండేవి.. ఇప్పుడు కాలం మారింది.. నిత్య జీవితంలో టెక్నాలజీ ఎంతో దోహదపడుతుంది. దానికి ఉదాహరణే ఈ ఎస్కలేటర్. ఇప్పుడు ఎస్కలేటర్ సాధారణంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో ఇంకా ఎన్నోచోట్ల చూశాం. మనం మెట్లు ఎక్కాలంటే ఎంతో కష్టపడతాం. రైల్వే స్టేషన్ లో కొంతమందైతే ఆ మెట్లు ఎక్కలేక ట్రాక్ లను దాటుతూ ఉంటారు. అలా ట్రాక్ దాటుతున్నప్పుడు ఎంతోమంది తమ ప్రాణాలు వదిలేవారో మీకు తెలుసు. కానీ ఇప్పుడు పెద్దపెద్ద రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్‌ను పెట్టి ఆ శ్రమ తగ్గించారు. దీని వలన అనేక మందికి మెట్లెక్కే శ్రమ తగ్గింది. ముఖ్యంగా వయసు పైబడిన వారు ఈ ఎస్కలేటర్ ను వినియోగిస్తుంటారు.కానీ ఎప్పుడైనా అనుకున్నారా ఎస్కలేటర్ వల్ల మనిషి ప్రాణాలు పోతున్నాయి అంటే నమ్ముతారా.. అయితే ఇది చదివేయండి.
జపాన్ టీవీల్లో కొత్త చట్టం అమలుపై ప్రకటనలు..
జపాన్ టీవీలో కొత్త చట్టం గురించి ప్రకటనలు ప్రచారం అవుతున్నాయి. అక్కడ వారి టీవీల్లో ఏ ప్రకటన చేస్తే మనకేంటి అంటారా.. అయితే ఇది చదవంటి అప్పుడు మీకే అర్థం అవుతుంది.
జపాన్ లోని నగోయా నగరంలో ఎస్కలేటర్ల నిషేధం..
ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి..?
జపాన్ లో నగోయా నగరం టీవీలో కొత్త చట్టాన్ని ప్రచారం చేస్తోంది జపాన్ ప్రభుత్వం. రైలు స్టేషన్లలో, బస్ స్టేషన్లలో ఈ మధ్య కాలంలో ప్రయాణికులు ఎస్కలేటర్లు అతివేగంగా ఎక్కి కిందికి దిగుతు ప్రమాదాలకు కారణమవుతున్నారు.. తన ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. ఇలా ఎస్కలేటర్ పై ఇలాంటి సంఘటనలు అనేకం నమోదయ్యాయి నగోయా నగరంలో. రోజు వృత్తిరిత్య, చదువులకు, రోజువారీ పనుల నిమిత్తం ఇలా నగోయ నగరంలో రైల్వే స్టేషన్ నుంచి మరో నగరంకి ప్రయాణాలు జరుగతు ఉంటాయి. అక్కడ ఒక్క నిమిషం అలస్యం అయిన రైల్ గాని, బస్సు గాని వెళ్లిపోతుంది.. దాన్ని అందుకునేందుకు యువతి, యువకులు ఎస్కలేటర్లను అతి వేగంగా వచ్చి ఎక్కి కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. ఇతరలు గాయపడుతున్నారు. ఇలా తరచు జరుగుతున్నాయి.వీటికి అదనంగా, బ్యాగ్ ఎత్తుకుపోవడం, చైన్ స్నాచింగ్ , వంటి దొంగతనాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎస్కలేటర్ పై ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ కొత్త ఆర్డినెన్స్ ను అక్టోబర్ 1 నుండి నగోయాలో నగరంలోని ఎస్కలేటర్లపై నడవడంపై నిషేధం అమల్లోకి వచ్చింది.
ఎస్కలేటర్ ప్రమాదాలకు ముఖ్య కారణాలు..
వంటివి ప్రమాదాలకు ముఖ్య కారణం అని గుర్తించి రిపోర్టులో తేల్చాయి.
జపాన్ లో ఎస్కలేటర్ పై జరిగిన ప్రమాదాల సంఖ్య..?
జపాన్ టైమ్స్ ప్రకారం.. 2018, 2019 మధ్యకాలంలో ఏకంగా 805 ఎస్కలేటర్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జపాన్ ఎస్కలేటర్ నియమాన్ని ఉల్లంఘించినందు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నివేదికలు తెలిపాయి. ఎస్కలేటర్లపై నడవడం లేదా పరిగెత్తడం వల్లనో ప్రజలు తమ బ్యాలెన్స్ కోల్పోతున్నారని.. తద్వారా అనుకోని సంఘటనలు జరిగాయని గుర్తించారు.
జపాన్ లో ఉన్న ఎస్కలేటర్ నియమం ఏంటి..?
జపాన్‌లో ఎస్కలేటర్ వినియోగంలో ఒక పద్దతి ఉంది. ప్రజలు ఎస్క్‌లేటర్ల ఎడమ వైపున నిలబడాలి. ప్రయాణికులు ఎక్కేందుకు లేదా దిగేందుకు కుడి వైపున తెరిచి ఉంచుతారు. ఇలా అయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎస్కలేటర్లు సురక్షితంగా దాటవచ్చు. కానీ అలా జరగడం లేదు నగోయా నగరంలో.. దీంతో ఎస్కలేటర్ పై ప్రమాదాలు ఎక్కువ శాతం జరుగుతున్నట్లు జపాన్ ప్రభుత్వం గుర్తించింది.
రెండోసారి ఎస్కలేటర్ పై నిషేధం విధించిన జపాన్..
జపాన్ దేశంలో ఇది రెండోసారి ఎస్కలేటర్ పై నిషేధం విధించడం. మొదటి సారిగా 2021లో తూర్పు జపాన్‌లోని సైతామా ప్రిఫెక్చర్‌లో ఇదే తరహాలో తరచు ఎస్కలేటర్ల పై ప్రమాదాలు, జరుగుతున్ మరణాలు, దొంగతనాలు జరగడంతో అక్కడ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది జపాన్.
S.SURESH