UP Exams : యూపీలో సరికొత్త కుంభకోణం.. పరీక్షల్లో జై శ్రీరామ్ చేస్తే.. ఫస్ట్ క్లాస్ పాస్

ఉత్తరప్రదేశ్ లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో ఓ షాకింగ్ కుంభకోణం బయటికొచ్చింది. పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు బదులు.. జై శ్రీరామ్ నినాదం, క్రికెటర్ల పేర్లు, పాటలు.. ఇలా ఇష్టాను సారంగా రాసిని ఆ విద్యార్థులు 60 శాతానికి పైగా మార్కులు రావడంతో పాటు ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తున్నారు అక్కడి కొందరు ప్రొఫెసర్లు.

 

ఉత్తరప్రదేశ్ లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో ఓ షాకింగ్ కుంభకోణం బయటికొచ్చింది. పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు బదులు.. జై శ్రీరామ్ నినాదం, క్రికెటర్ల పేర్లు, పాటలు.. ఇలా ఇష్టాను సారంగా రాసిని ఆ విద్యార్థులు 60 శాతానికి పైగా మార్కులు రావడంతో పాటు ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తున్నారు అక్కడి కొందరు ప్రొఫెసర్లు.. దీనిపై ఆరా తీయగా ఇది ఓ పెద్ద కుంభకోణంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ చట్టం కింద కొన్ని సమాధాన పత్రాలను పరిశీలించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గవర్నర్ వీసీ తగిన చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. దీంతో.. పూర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ప్రొఫెసర్ల ను సస్పెండ్ చేశారు.

ఈ కుంభకోణంలో పక్కా ప్రణాళికతో.. డబ్బు కోసం.. యూనివర్శిటీలోని కొందరు అధికారుల అండతో సున్నా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా 60 శాతానికి పైగా మార్కులు ఇచ్చి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా పాస్ చేస్తున్నారు.

వైస్-ఛాన్సలర్ వందనా సింగ్..

పూర్వాంచల్ యూనివర్సిటీలో జరిగిన పరీక్ష విధానంలో చాలా కుంభకోణాలు ఉన్నట్లు.. “విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణ ఉంది. అందుకే మేము ఒక కమిటీని ఏర్పాటు చేసాము. ఆ కమిటీ తన నివేదికలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు కేటాయించినట్లు పేర్కొంది” అని వైస్-ఛాన్సలర్ వందనా సింగ్ అన్నారు. బుధవారం జరిగిన పరీక్షల కమిటీ సమావేశంలో ఎగ్జామినర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చేశారు.

పరీక్ష పేపర్ లో జై శ్రీరామ్…

‘ఫార్మసీ యాజ్ కెరీర్’ అనే సమాధానం మధ్యలో జై శ్రీరామ్ అని అంటూ నినాదం రాశాడు. అక్కడితో ఆగకుండా టీమిండియా స్టార్ క్రికెటర్ల పేర్లు సైతం “హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెటర్ల” సమాదాన పత్రాలపై నింపేశారు.

కాగా ఇదంతా.. కొందరు ప్రొఫెసర్లు డబ్బుకోసం అక్రమ పద్దతులలో విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు తీగిరి పునరావృతం అవ్వనివం అని వైస్-ఛాన్సలర్ వందనా సింగ్ వెల్లడించారు.

SSM