Ice Bath: ఐస్ బాత్ నేటి యుగపు సరికొత్త ట్రెండ్.. దీనివల్ల ప్రయోజనాలేంటి..?

మనం సాధారణంగా టబ్ బాత్ చూసి ఉంటాం, స్ట్రీమ్ బాత్ కూడా చూసి ఉంటాం. అయితే ఇదేంటి వింతగా ఐస్ బాత్ అని అనుకోవచ్చు. అవును ఈమధ్య మన సినిమా తారలందరూ ఈ ఐస్ బాత్ బాట పట్టారు.

  • Written By:
  • Publish Date - September 2, 2023 / 03:36 PM IST

ఈ ఐస్ బాత్ సంస్కృతి ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్లుగా మన పొరుగు దేశాల్లో అందుబాటులో ఉంది. బ్రైన్ అండ్ బాడీ రిలాక్స్ కోసం అప్పుడప్పుడూ ఈ రకమైన ప్రక్రియను చేస్తూ ఉంటారు. గత కొన్ని నెలలుగా మన దేశంలో తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం రకుల్ ప్రీతి సింగ్ ముందుగా చల్లని మంచు గడ్డలు ఉండే నీళ్ళలో దిగి స్నానంచేశారు. ఈ వీడియోని తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. దీంతో ప్రతి ఒక్క హీరోయిన్ దీనిని టాస్క్ గా భావించి ఐస్ బాత్ చేసి తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఈ బాటలో ప్రగ్యా జైస్వాల్, నేహా శర్మ, ఐషా, సమంతా ఇలా ప్రతి ఒక్కరూ క్యూ కట్టారు. అయితే వీటిని మన దేశంలో చేయలేదు. ఫిన్ లాండ్, అమెరికాల్లో లాంగ్ వెకేషన్ లో ప్లాన్ చేశారు. తాజాగా సమంత కూడా ఒక బాత్ తొట్టెలో ఆరు నిమిషాలపాటూ మైనస్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలో కూర్చున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు. దీని వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

శారీరక, మననసిక ఉపశమనం..

  • జిమ్ చేసినప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అప్పుడు ఈ ఐస్ బాత్ ఉపశమనం కలిగిస్తుంది.
  • ఏవైనా వ్యాయామాలు చేసినప్పుడు, కండరాల నొప్పులు ఉన్న సమయంలో మైనస్ చల్లనీళ్ల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • అలాగే శరీరం మొత్తం చమటతో కంపరం కలిగినప్పుడు ఇలా చల్లనీటిలో స్నానం చేయడం వల్ల రిలాక్సింగ్ గా ఉంటుంది.
  • అలసట, నిద్ర పట్టకుండా ఉండటం లాంటి సమస్యలు ఉన్న వాళ్లు ఐస్ బాత్ చేయడం వల్ల నరాలు త్వరగా స్పందిస్తాయి. తద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడి త్వరగా నిద్ర పట్టేందుకు అవకాశం ఉంటుంది.
  • హైపమైన్ అనే హార్మోను మానసిక సమస్యలను నివారిస్తుంది. ఈ హార్మోన్ సహజంగా మాత్రమే ఉత్పత్తి అవతుంది. ఇలా ఐస్ బాత్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేసి ఈ హార్మోన్ ఉత్పత్తిలో దోహదపడుతుంది.
  • జీర్ణ వ్యవస్థతో పాటూ గుండె పనితీరు సమర్థవంతంగా ఉండేలా దోహదపడుతుంది. ఇంట్లో పనులు ఎక్కువైన సమయంలో కాసేపు అలా ఐస్ బాత్ చేసినా ఎంతో హాయి కలుగుతుంది.
  • శరీరం మొత్తం కాకపోయినా కాళ్లు, చేతులతో పాటూ మనకు అవసరమైన భాగాలను ఐస్ ముక్కలు వేసిన తొట్టెలో ఉంచి సేదతీరవచ్చు.
  • కూల్ వాటర్ తో టబ్ బాత్ చేసేటప్పుడు అదనంగా ఐస్ ముక్కలు వేసుకునే ముందు మన శరీరానికి తగ్గట్టుగా చల్లదనాన్ని చూసుకోవాలి. మనకు తట్టుకునే సామర్ధ్యం ఉంటే అదనపు ఐస్ ముక్కలు జతచేసుకోవచ్చు.
  • కేవలం నిమిషాల వ్యవధిలో మాత్రమే స్నానం చేయాలి. అరగంట, గంట సేపు చేయడం వల్ల లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
  • నీటిలో మునిగేటప్పుడు ముందుగా పాదాలు, ఆతరువాత మోకాలు, ఆపై నడుము ఇలా పూర్తి శరీరాన్ని మెడ వరకూ మాత్రమే నీటిలో ఉండేలా చూసుకోవాలి.

T.V.SRIKAR