MURDER MYSTERY : కారు చెప్పిన హత్య కధ.. ఓనర్ అలా దొరికిపోయాడు !

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఓ కారు చోరీ కేసుతో మర్డర్ మిస్టరీ బయటపడింది. చంద్రగిరి మండలం తొండవాడ విల్లాస్ లో 10 రోజల క్రితం కారు చోరీ జరిగింది.  దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓనర్ రవీంద్ర రెడ్డి.  పోలీసులు కేసు పెట్టి కారు దొంగలను పట్టుకున్నారు.  వాళ్ళు చెప్పింది విన్న పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.  అది కారు దొంగతనం కాదు... దాని వెనక మర్డరీ మిస్టరీ ఉందని తేలింది.

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 09:27 AM IST

ఏపీలో తిరుపతిలో కారు దొంగతనం కేసుతో ఓ మర్డర్ (Murder )బయటపడింది. పోలీసులు ఎంక్వైరీ చేయడంతో 8 నెలల క్రితం జరిగిన హత్య బయటకు వచ్చింది. కారు ఓనర్ రవీంద్ర రెడ్డి  చేసిన మర్డర్ కు సాయం చేశాం… మాకు డబ్బులు ఇవ్వట్లేదు… అందుకే కారు ఎత్తుకెళ్లామని చెప్పారు నిందితులు. అనంతపురంకు చెందిన రవీంద్ర రెడ్డి… SC సామాజిక వర్గానికి చెందిన జూట్ల జయమ్మను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఓ కొడుకు పుట్టాక జయమ్మతో మనస్పర్థలు రావడంతో ఆమెను వదిలిపెట్టేశాడు. రెండో పెళ్ళి చేసుకొని… చంద్రగిరి మండలం తొండవాడకు మకాం మార్చాడు రవీంద్ర రెడ్డి.   పక్కనే ఉన్న బుచ్చినాయుడు పల్లెలో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం చేస్తున్నాడు. రవీంద్ర రెడ్డిని వెతుకుతూ గత ఏడాది మే 25న తొండవాడకు చేరుకుంది మొదటి భార్య జయమ్మ. పౌల్ట్రీ ఫామ్ దగ్గర ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అప్పుడు ధనమ్మను కొట్టి చంపాడు రవీంద్ర రెడ్డి.  పౌల్ట్రీ ఫామ్ లో పని చేస్తున్న వాళ్ళతో కలిసి మృతదేహాన్ని రాజంపేట ప్రాంతంలో పాతిపెట్టాడు.

అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో గత ఏడాది జూన్ 3న  జయమ్మ సోదరుడు… దేవేంద్ర ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదైంది.  ఈ మర్డర్ మిస్టరీని కారు దొంగల సాయంతో ఛేదించారు పోలీసులు. రవీంద్ర రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట ప్రాంతంలో పాతిపెట్టిన జయమ్మ మృతదేహం కోసం వెతుకుతున్నారు. మర్డర్ జరిగి 8నెలలు కావడంతో పాతిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించలేకపోతున్నారు.  మొత్తమ్మీద మర్డర్ మిస్టరీని ఓ కారు చోరీ కేసు బయటపెట్టింది… నిందితుడిని పట్టించింది.