ఐపీఎల్ 17వ (IPL 17) సీజన్‌ను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పేలవంగా ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన చివరి మ్యాచ్‌లో అయితే ముంబై (Mumbai) దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఏకంగా 277 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ముంబై ఓటములకు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్నాడు. పాండ్యా కెప్టెన్స్ (Pandya Captaincy) పరంగానే కాకుండా ఆటగాడిగా కూడా తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
చాలా మంది మాజీలు సైతం హార్దిక్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాండ్యాను వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ముంబై కెప్టెన్సీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హార్దిక్ పాండ్యా పట్ల ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని తమ జట్టు పగ్గాల నుంచి తప్పించే ఆలోచనలో ముంబై ఫ్రాంచైజీ ఉన్నట్టు వినికిడి. అతడి స్ధానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తమ జట్టు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు వినిస్తున్నాయి. మరి రాబోయే మ్యాచ్‌ల్లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి