Parliament Building: 97ఏళ్ల చారిత్రాత్మక పార్లమెంట్ భవనాన్ని ఏం చేయబోతున్నారు.?

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ దాదాపు 75 ఏళ్లకు పైగా అనేక చట్టలకు, గొడవలకు, ప్రత్యేక పరిస్థితులకు, దేశంలో అభివృద్దికి, ఆర్థిక స్థితిగతులకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉంటాయి.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 01:27 PM IST

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ దాదాపు 75 ఏళ్లకు పైగా అనేక చట్టలకు, గొడవలకు, ప్రత్యేక పరిస్థితులకు, దేశంలో అభివృద్దికి, ఆర్థిక స్థితిగతులకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉంటాయి. వీటన్నింటినీ తన కడుపులో చెరిగిపోని చిరస్మరణీయంగా గుర్తుంచుకున్న చారిత్రాత్మక కట్టడమే పురాతన పార్లమెంట్ భవనం. దీనిని రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారో అన్న అనుమానాలను క్రింది వివరాలు చదివి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు నూతనంగా నిర్మించిన సెంట్రల్ విస్తాలో జరుగనున్నాయి. దీంతో పాత భవనాన్ని ఏం చేస్తారు.. అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతోంది. కొందరు కూల్చేస్తారంటుంటే మరి కొందరు ఏదో ఒక ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇంతకూ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించిందో ఏమని వివరణ ఇచ్చిందో తెలుసుకుందాం.

ఇప్పటి వరకూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించుకున్న పాత భవనం బ్రిటీష్ కాలంలో నిర్మించినది. దీనిని అప్పటి బ్రిటీష్ వాస్తు శిల్ప కళాకారులు సర్ ఎడ్విన్ లుడియన్స్, హెర్బర్ట్ బేకర్ 1927లో నిర్మించారు. ఈ పురాతన భవనానికి దాదాపు వందేళ్ళ చరిత్ర ఉంది. ఈ సంవత్సరంతో 97 ఏళ్ల పూర్తి చేసుకుంది. ఈ భవనాన్ని కూల్చి వేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని లోక్ సభ సచివాలయ సిబ్బంది మీడియాకు తెలిపింది. ఇందులో మ్యూజియం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో పార్లమెంట్ భవనం ఎలా ఉండేదో చూసేందుకు వీలు కల్పిస్తూ సామాన్యులకు అనుమతించేందుకు చర్యలు చేపట్టనుంది. అయితే ఈ భవనాన్ని కొంత రీమోడల్ లో పునరుద్దరించేందుకు సిద్దమైంది. భారతదేశపు పురాతన చారిత్రాత్మక వారసత్వ సంపదగా అభివృద్ది చేసేందుకు కేంద్రం నిర్ణయించుకుంది. దీనికి సంబధించిన బ్లూ ప్రింట్ ను కూడా సిద్దం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పాత భవనంలోని నేషనల్ ఆర్కైవ్స్ నూతన భవనానికి తరలిస్తున్నారు. దీంతో ఈ ప్రదేశం మొత్తం ఎంతో విశాలంగా మారనుంది. దీనిని ఇతర అధికారిక సమావేశాలకు కేటాయించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

T.V.SRIKAR