Kavita Vs ED: నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానున్న కవిత ఈడీ పిటిషన్లు

నేడు సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణకు రానున్న తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈసారి కవిత ఏం చెబుతారు. ఈడీ విచారణకు హాజరవుతారా.. లేక మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అని ఆత్రతతో ఎదురు చూస్తున్నారు.

  • Written By:
  • Updated On - September 26, 2023 / 09:59 AM IST

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ విచారణకు అదేశించారు. ఆ తరువాత చాల కాలం ఎలాంటి విచారణకు పిలువలేదు ఈడీ. దీంతో సమస్య సర్థుమణిగిందనుకున్నారు. కానీ తాజగా మరోసారి కవితకు నోటీసులు అందించింది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో మరోసారి విచారణ కు హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈడీ దర్యాప్తు పై కవిత అభ్యంతరకరం..

కవిత ఈ పిల్ లో కొన్ని విషయాలను దాఖలు చేశారు. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడం సీఆర్పీసీ కి విరుద్దమని, గతంలో ఇలాంటి ఆర్థిక, అవినీతి ఆరోపణల కేసులో నళిని చిదంబరాన్ని ఇంటి నుంచి విచారణ జరిపారని ఉదాహరించారు. ఈ తరహాలో తనను కూడా ఇంటి నుంచే విచారణ జరిపేలా కోర్టు వారు ఈడీ అధికారులకు ఆదేశించాలని కోరారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల తీరును తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. తనను ఇంటి నుంచి విచారణకు ఆదేశించమని కోర్టులో పిటిషన్ వేసిన సమయంలో దానిని కోర్టు స్వీకరిస్తూ విచారణ చేపట్టింది. ఇలా కోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో మరో సారి నోటీసులు ఎలా ఇస్తారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

నేటితో ముగియనున్న గడువు..

ఇదిలా ఉంటే ఈడీ కూడా తనదైన వాదనను వినిపించింది. కవితకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమే అని చెప్పింది. దీనికి కవిత బదులు ఇస్తూ నేను విచారణకు హాజరుకాలేనని కరాకండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అంత బిజీగా ఉన్న పక్షంలో విచారణకు ఒక 10 రోజుల సమయాన్ని పొడిగిస్తామని కోర్టుకు తెలిపారు. దీనికి సుప్రీం కోర్టు అంగీకరించి వాదనలను వాయిదా వేసింది. నేటితో 10 రోజుల గడువు ముగియనుండటంతో ఈడీ మరోసారి కోర్టులో తన వాదనలు వినిపించనుంది. ఈ సారి కవిత కోర్టుకు ఏం చెబుతారో వేచిచూడాలి. దీనిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

T.V.SRIKAR