ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబు అరెస్ట్ అయి 37 రోజులు అయింది. అయినప్పటికీ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. బెయిల్ కోసం ఎన్ని పిటిషన్లు వేసినా కొట్టేస్తూ వచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో సరికొత్తగా అనారోగ్య సమస్యను వెలుగులోకి వచ్చారు. అయితే తాజాగా విడుదలైన హెల్గ్ బులిటెన్ లో చర్మ సంబంధిత వ్యాధి మినహా మరే రకమైన అనారోగ్య సమస్యలు లేవని వెల్లడించారు డాక్టర్లు. అలాగే ఆయనకు చల్లని వాతావరణం ఉండాలన్న మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఏసీబీ కోర్టు చంద్రబాబు బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఏపీ హైకోర్టులో తీర్పులు – విచారణలు ఇవే..
నేడు ఏపీ హైకోర్టులో అమరావతి అసైన్డ్ భూముల కేసులో తీర్పు వెలువడనుంది. ఇందులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. అసైన్డ్ భూముల కోసం జీవో నంబర్ 41 ని కేబినెట్ ఆమోదం లేకుండా తీసుకొచ్చినట్లు సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై తీవ్రంగా ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది. ఇక గతంలో ఏసీబీ కోర్టు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడంతో నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు చంద్రబాబు తరఫు లాయర్లు. ఇదిలా ఉంటే అసైన్ట్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ తాజాగా నమోదు చేసిన 2 పిటిషన్లపై ముందస్తు బెయిల్ తో పాటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు నారాయణ తరఫు న్యాయవాదులు. ఇందులో ఏ రకమైన జడ్జిమెంట్ అవస్తుందా అని అందరికీ ఉత్కంఠ నెలకొంది. అయితే నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ సహా క్వాష్ పిటిషన్లను తోసిపుచ్చే అవకాశం ఉందంటున్నారు సీనియర్ న్యాయ నిపుణులు. అలాగే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాములో బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బెయిల్ పిటిషన్ స్వీకరించినా వాయిదా పడే అవకాశం ఉంటుంది. దీనికి కారణం సుప్రీంలో ఈకేసు రిజిస్టర్ అయినందున అక్కడి తీర్పు మీదే ఈ కోర్టులన్నీ నడుచుకుంటాయంటున్నారు న్యాయనిపుణులు.
సుప్రీంలో ఏం జరుగుతోంది..
చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాముకు సంబంధించిన కేసు బుధవారానికి వాయిదా పడింది. సుప్రీం కోర్టు చెప్పే నిర్ణయం పైనే అందరి దృష్టి మళ్లింది. గతంలో ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన తరుణంలో దీనిని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు బాబు తరఫు న్యాయవాదులు. అయితే దీనిపై గడిచిన 20 రోజులుగా వాదనలు, వాయిదాలు పడుతూ వస్తోంది. గత వాదనలలో హరీష్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా 17ఏపై తీవ్రంగా చర్చించారు. 2020లో కేసు నమోదు చేసి విచారణ జరిపినట్లు చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ఈ కేసు 2017లోనే నమోదైనట్లు దీనికి సంబంధించిన దర్యాప్తుకూడా కొంత సాగినట్లు కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ డీజీ రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో టీడీపీ వాదనలు నీరుగారిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 17 ఏ అనేది కేవలం 10 శాతం మాత్రమే.. మిగిలిన 90శాతం సెక్షన్లు, కేసుల గురించి ప్రస్తావించింది సుప్రీం కోర్టు. దీనికి వాదనలు వినిపించాల్సి ఉంది. 2017 లో నమోదైతే 17 ఏ వర్తిస్తుంది. అదే 2019-20 లో కొత్త చట్టంలో చేసిన సవరణల ప్రకారం అవినీతి నిరోధక చట్టం వర్తించదు అనేది చంద్రబాబు లాయర్ల వాదన. అయితే 2017 మే నెలలో పుణెలోని కొన్ని షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించిన జీఎస్టీ అప్పటి ప్రభుత్వానికి నోటిసులు కూడా ఇచ్చిన అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో ఈ కేసు ఎటుపోతుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
T.V.SRIKAR