కోదండరాంకు ఇచ్చే పదవి అదే.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌..

సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రేవంత్ తన మార్క్ నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వర్గాలను.. ఉద్యమకారులకు పార్టీని మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణపై నిజమైన చిత్తశుద్ధి ఉంది తమకే అనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం వెనక.. కోదండరాం సూచనలు ఎన్నో ఉన్నాయ్. తనకు ప్రత్యేకంగా పార్టీ ఉన్నా..

సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రేవంత్ తన మార్క్ నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వర్గాలను.. ఉద్యమకారులకు పార్టీని మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణపై నిజమైన చిత్తశుద్ధి ఉంది తమకే అనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం వెనక.. కోదండరాం సూచనలు ఎన్నో ఉన్నాయ్. తనకు ప్రత్యేకంగా పార్టీ ఉన్నా.. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను ఓడించాలి, గద్దె దించాలన్న లక్ష్యంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు కోదండరామ్. ఓటు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత హస్తం పార్టీకి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఇప్పుడు ఆయనకు ఏ పదవి కట్టబెడతారనే చర్చ కొద్దిరోజులుగా వినిపిస్తోంది.

టీఎస్పీఎస్సీ బాధ్యతలు అప్పగిస్తారని ఒకసారి.. ప్రభుత్వ సలహాదారుగా ఉంటారని మరోసారి.. ఇలా రకరకాల ప్రచారం వినిపించింది. ఐతే కోదండరామ్‌కు ఇచ్చే పదవిపై ఇన్నాళ్లుకు సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. రెడ్డి. ఎన్నికలకు ముందు కోదండరామ్‌కు ఇచ్చిన హామీని త్వరలోనే నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎన్నికలకు ముందు నుంచే తెలంగాణ జన సమితితో తమకు ఒప్పందం ఉందని.. అందులో భాగంగా ఆ పార్టీకి రెండు ఎమ్మెల్సీ పదవులు, కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కోదండరామ్‌ ఎమ్మెల్సీ కాబోతున్నారని చెప్పకనే చెప్పారు రేవంత్‌.

కోదండరామ్‌ను తక్షణమే ఎమ్మెల్సీని చేయాల్సిన అవసరం ఉందని.. జనాలు కూడా ఆయనను చట్టసభల్లో చూడాలని కోరుకుంటున్నారన్నారని అన్నారు. గవర్నర్ కోటాలో కోదండరామ్‌ను పెద్దల సభకు పంపుతామని చెప్పారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయ్. ఎమ్మెల్సీ ఇచ్చి ఊరుకుంటారా.. లేదంటే ఆయనను కేబినెట్‌లోకి తీసుకుంటారా.. రేవంత్, కాంగ్రెస్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.