America President: అమెరికా ప్రెసిడెంట్ కు ఐ ఫోన్ ఇవ్వరు.. ఎందుకు ?

అమెరికా అధ్యక్షుడికి హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఫోన్ విషయంలో కొంత అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 11:40 AM IST

అమెరికా ప్రెసిడెంట్ అంటే మజాకా ? ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్ర రాజ్యానికి అధిపతి !! ఆయన ఏ ఫోన్ వాడుతారో ఊహించగలరా ? అత్యంత ఖరీదైన ఐఫోన్ ను అమెరికా ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నవాళ్లు వాడుతారని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం వేరు. అమెరికా రహస్యాలను కాపాడే నిమిత్తం ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నవారు కొన్ని ప్రత్యేకమైన మోడిఫైడ్ ఫోన్లనే వాడుతారు. వాటిని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ స్వయంగా తయారు చేసి ప్రెసిడెంట్ కు అందిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాక్ కాని రీతిలో ప్రత్యేక ఫోన్లను మోడిఫై చేసి.. ప్రెసిడెంట్ కు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అందిస్తుంటుంది. వైట్ హౌస్ లో ఉండే ల్యాండ్ లైన్ ఫోన్ల నుంచి మొదలుకొని పర్సనల్ సెల్ ఫోన్ దాకా ప్రతీదీ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చెప్పిందే అమెరికా అధ్యక్షుడు వాడాల్సి ఉంటుంది.

ఒబామా వెరీ డిఫరెంట్..

ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ రూల్స్ ను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. కానీ గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన బరాక్ ఒబామా పూర్తి విభిన్న వ్యక్తి. ఆయన ఫోన్ వినియోగంలో తనకు స్వేచ్ఛ ఉండాలని కోరుకున్నారు. ఎంతో ఇష్టమైన బ్లాక్‌ బెర్రీ ఫోన్ ను వాడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని భద్రతా సలహాదారులతో చాలాకాలం పోరాడారు. చాలాకాలం పోరాడిన తర్వాత సీనియర్ ఉద్యోగులు, దగ్గరి స్నేహితులతో మాత్రమే టచ్‌ లో ఉండేలా బ్లాక్ బెర్రీ ఫోన్ ను వాడేందుకు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆయనకు అనుమతి ఇచ్చింది. ఒకానొక సందర్భంలో ఒబామా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా కూతుళ్లు సశా, మలియాలు ఎక్కువ టైం ఐఫోన్స్‌తోనే గడుపుతుంటారు’’ అని చెప్పారు. 2010లో ఐప్యాడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు కూడా ఒబామా ముచ్చటపడ్డారంట. దీంతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు ఐప్యాడ్ ను తీసుకొని మరింత సురక్షితమైన “ఒబామాప్యాడ్‌”ని తయారు చేసి చేతిలో పెట్టారట.

ట్రంప్, క్లింటన్, బుష్..

అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ తమ పదవీకాలంలో స్మార్ట్‌ ఫోన్ గాడ్జెట్లకు దూరంగా ఉండేవారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఎక్కువగా యాపిల్‌ న్యూస్‌ యాప్‌ ను వాడుతున్నారు. అయితే ఇది సమస్యలను సృష్టించే రిస్క్ ఉందని అమెరికా సెక్యూరిటీ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్స్ గా పనిచేసిన ట్రంప్ ఐఫోన్ కస్టమైజ్డ్ మోడల్, శాంసంగ్ కస్టమైజ్డ్ మోడల్ వాడేవారు. బిల్ క్లింటన్, జార్జ్ బుష్ లు మోటరోలా ఫోన్ ను వాడేవారు. వీటన్నింటికి తోడు ప్రతి అమెరికా అధ్యక్షుడికి ఒక శాటిలైట్ ఫోన్ ను ఇస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ శాటిలైట్ ఫోన్ నుంచి ప్రపంచ నాయకులతో అమెరికా అధ్యక్షులు మాట్లాడతారు. అమెరికా అధ్యక్షుడు తన విమానం ఎయిర్ ఫోర్స్ 1లో ఉన్నప్పుడు కూడా ఈ శాటిలైట్ ఫోన్ పనిచేస్తుంది.