Indian Railways: 2024 నాటికి అందుబాటులోకి రానున్న వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో సర్వీసులు

వందే భారత్ రైళ్లు మన దేశంలో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. వీటి స్థానంలో మరింత మెరుగులు అద్ది స్లీపర్ కోచ్ లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది రైల్వే శాఖ. ఈ విషయాన్ని తాజాగా చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు.

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 04:17 PM IST

భారతదేశంలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా రైల్వే వ్యవస్థలో క్రమక్రమంగా మార్పులు తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే వందే భారత్ ఎక్స్ ప్రెస్ అనే పేరుతో సరికొత్త రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి వేగం గతంలో ప్రయాణించే రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయాన్ని బాగా కుదించడం కోసం తక్కువ స్టాపులతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే వీటి స్థానంలోకి వందే మెట్రో ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకురానున్నారు. 2024 లో ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

వందే భారత్ మెట్రో రైలు ప్రత్యేకతలు..

  • 2024 జనవరి నాటికి పట్టాలెక్కనుంది.
  • తక్కువ దూరాలకు త్వరగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది.
  • కూర్చొని ప్రయాణించేలా సిట్టింగ్ ఏర్పాట్లు ఉంటాయి.
  • తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసేందుకు వీలుపడుతుంది.
  • 12 కోచ్ లతో కూడిన నాన్ ఏసీ రైలు.

వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలు..

  • 2024 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి.
  • రాత్రి పూట ప్రయాణాలకు అనువుగా ఉండేందుకు తీసుకురానున్నారు.
  • ప్రయాణీకులకు సౌకర్యార్థం 16 ఏసీ కోచ్ లతో రానున్నాయి.
  • త్వరగా ప్రయాణించేందుకు వీలుంటుంది.
  • సుదూర ప్రాంతాలకు మాత్రమే ఉపయోగపడుతుంది.
  • రాజధాని రైళ్లను భర్తీ చేయనున్నాయి.

T.V.SRIKAR