Train Accident : దేశంలో రైళ్ల ప్రమాదం.. ప్రయాణించాలంటే ప్రజల్లో భయం భయం.. ఎందుకు..?

గత కొన్ని రోజులుగా భారతదేశంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా ఉత్తర భారత దేశంలోనే అత్యధికంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులకు రైళ్లలో ప్రయాణించాలంటే జంకుతున్నారు.

రైల్వే వ్యవస్థ (Railway System) భారత దేశంలోనే అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ (Public Transport System) ఇది.. ఈ రైల్వే వ్యవస్థకు భారత దేశం ప్రతేకంగా ఒక బడ్జెట్ ను రూపోందిస్తుంది. దేశ వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల మంది నిత్య రవాణా వ్యవస్థగా.. ప్రజలు సుదూర ప్రయాణాల కోసం రైళ్లను ఆశ్రయిస్తుంటారు. తక్కువ ధరకే టిక్కెట్ కొని.. వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు దేశ ప్రజలు.. గరిబోడు ఎక్కే ఎకైక బండి… ఈ రైలు బండి.. కానీ నేడు రైలు ఎక్కాలంటే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. రైలులో ప్రయాణం చేస్తే మన జీవితం గల్లంతే అన్న సమాదానాలు వస్తున్నాయి. ఈ యాక్సిడెంట్స్‌కు సిగ్నలింగ్ వైఫల్యం.. ట్రాక్ భద్రతా లోపాలే కారణం.. వీటిని ఆపలేమా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

Srisailam Dam, Chandrababu : శ్రీశైలం డ్యామ్‌ మరో రెండు గేట్లు ఎత్తివేత.. ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు..

గత కొన్ని రోజులుగా భారతదేశంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా ఉత్తర భారత దేశంలోనే అత్యధికంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులకు రైళ్లలో ప్రయాణించాలంటే జంకుతున్నారు. రైలు ప్రమాదాల గురించి అప్పట్లో.. అని వివరంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే 2023లో ఒడిశా రైలు ప్రమాదం ఇంకా మన కళ్ళ ముందు మెదులుతునే ఉంది. ప్రయాణికులు గుండెల్లో ఇంకా ఆ రైళ్లు ప్రమాదపు దృశ్యాలు పరిగెత్తుతూనే ఉన్నాయి. ఒడిశా కోరమాండల్ (Odisha Coromandel) రైలు ప్రమాదం దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచాన్నికే ఓ వనుకు పుట్టించింది. అంత భయానకంగా రైలు ప్రమాదం జరిగింది. ఇంతటి ఘోర ప్రమాదం తర్వాత అయిన రైల్వే శాఖ (Railways Department), జగ్రతల్లో ఏమైన గుణపాఠాలు నేర్చుకుందా అంటే.. లేదు.. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత మరో రెండు భారీ ప్రమాదాలు సైతం జరిగాయి. ఉత్తరప్రదేశ్ లోని గోండా రైల్వే స్టేషన్ సమీపంలో చండీగఢ్-దిబ్రూగఢ్ (Chandigarh-Dibrugarh) రైలు ప్రమాదం జరిగి ఎనిమిది బోగీలు పట్టాలు తప్పన ఘటనలో నలుగురు మృతి చెందగా.. 35 మంది పైగా గాయపడ్డారు. మరో ప్రమాదం జూలై 30న హౌరా -ముంబై (Howrah – Mumbai) మెయిల్ పట్టాలు తప్పి.. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఇటీవలి కాలంలో ఒకే ట్రాక్‌పై 2, 3 రైళ్లు వచ్చి ఢీకొనడం.. రైళ్లు పట్టాలు (Train tracks) తప్పిన ఘటనలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం, తీవ్ర గాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. కేవలం గత ఆరు వారాల్లో మూడు ప్యాసింజర్స్ రైలు ప్రమాదాలు సంభవించాయి.

Wayanad Landslides : కేరళలో ప్రకృతి విలయతాండవం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 93కి చేరిన మృతుల సంఖ్య!

ఇక తాజాగా దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జార్ఖండ్‌ (Jharkhand) లోని జంషెడ్‌పూర్‌ (Jamshedpur) కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబూ ప్రాంతంలో 18 బోగీలు పట్టాలు తప్పాయి. మహారాష్ట్ర (Maharashtra) లోని ముంబై (Mumbai) నుంచి పశ్చిమ బెంగాల్‌ (West Bengal) లోని హౌరాకు వెళ్లే హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ (Howrah – CSMT Express) రైలు.. మంగళవారం ఉదయం 3.45 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ రైలు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Suresh SSM