అల్లు అర్జున్ ఫాన్స్ లో రోజు రోజుకి ఆగ్రహం పెరిగిపోతుంది. బాహుబలి రెండో పార్ట్ కే రెండేళ్ళు పట్టింది… అలాంటిది పుష్ప రెండో పార్ట్ కు ఇంకెన్ని రోజులు పడుతుంది అంటూ ఆగ్రహంగా సోషల్ మీడియాలో కొందరు తిట్టడం కూడా మొదలుపెట్టారు. మొదటి పార్ట్ విడుదలై మూడేళ్ళు అవుతుంది, అప్పటి నుంచి బన్నీ… పుష్ప 2 సినిమాలోనే ఉన్నారు. ఈ సినిమాపై వస్తున్న వార్తలు కూడా ఫాన్స్ ని చికాకు పెడుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ యూరప్ వెళ్ళడం, సుకుమార్ అమెరికా వెళ్ళడంతో అసలు సినిమా షూట్ ఏమైంది అనే ఆందోళన మొదలయింది.
దానికి తోడు అల్లు అర్జున్ గడ్డం కూడా తీసేసి వెళ్ళడంతో సినిమా ఇప్పట్లో ఉండదా అనే అనుమానాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 30 రోజులు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో ఎలా అయినా విడుదల చేయాలని నిర్మాతలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ కూడా వేసారు. ఆ సెట్ వేసి రెండు నెలలు అవుతున్నా ఒక్క రోజు కూడా షూట్ జరగలేదు. ఈ సినిమా గురించి అల్లు అర్జున్ వేరే సినిమాలను కూడా ప్రకటించకుండా సైలెంట్ గా ఉన్నారు.
ఈ తరుణంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేసారు. సుకుమార్ కు పుష్ప అనేది చాలా స్పెషల్ అని చెప్పిన ఆయన రెండో పార్ట్ కోసం చాలా మార్పులు చేసారని అన్నారు. అందుకే సినిమా ఆలస్యం అవుతుందని చెప్పిన ఆయన… అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ లను ఈ ఆగస్ట్ లో ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దు అని, డిసెంబర్ లోనే సినిమా వస్తుందని, ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతుందని బన్నీ వాసు స్పష్టం చేసారు.