మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దృవ మూవీ వచ్చి ఏడేళ్లవుతోంది. ఈ ఏడెల్లలో 3 ఏళ్లుకేవలం త్రిబుల్ ఆర్ కే సమర్పించుకున్నాడు రామ్ చరణ్. తర్వాత రెండేళ్లుగా గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కతూనే ఉంది. మధ్యలో ఆచార్య వచ్చి అంతో ఇంతో మెగాఫ్యాన్స్ ని కొంతవరకు కాపాడిందే అనుకోవాలి. అది హిట్ కాకున్నా కనీసం తమ అభిమాన హీరో తాలూకు అప్ డేట్ మూవీ రూపంలో వచ్చి ఫ్యాన్స్ కి అంతో ఇంతో సంతోషాన్నిచ్చింది.
కాని శంకర్ ఏదో మ్యాజిక్ చేస్తాడని హోప్ పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ మాత్రం గేమ్ ఛేంజర్ విషయంలో నీరీక్షించి, నీరసించి పోతున్నారు. భారతీయుడు 2 రిలీజ్ డేట్ 2024 ఆగస్ట్ 15 కి అంటున్నారు. అదైనా నిజమైతే ఇక గేమ్ ఛేంజర్ ముందే విడుదలయ్యే చాన్స్ ఉంది.
మోస్ట్ లీ మే 9 తర్వాతే ఆ డేట్ ఉండొచ్చట. మార్చ్ లో బన్నీ మూవీ పుష్ప 2 వచ్చే ఛాన్స్ ఉంది. తారక్ మూవీ దేవర ఏప్రిల్ 5 కి రాబోతోందని ఎప్పుడో ఫిల్మ్ టీం తేల్చింది. మే 9న కల్కీ 2898 ఏడీ మూవీ రావొచ్చు.. సో మే థర్డ్ వీక్ లోనే గేమ్ ఛేంజర్ వస్తుందని తెలుస్తోంది. దిల్ రాజు కూడా శంకర్ కి ఈ విషయం తేల్చాడట. ఆలోగా అంటే పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవ్వాలి. కాని అవుతుందా? భారతీయుడు 2 షూటింగ్ పూర్తి కావొచ్చింది. అలాంటి ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కే 7 నెలల టైం తీసుకుంటున్నాడు శంకర్. అందుకే వచ్చే ఏడాది ఆగస్ట్ 15 కి ఈ సినిమా రిలీజ్ పెట్టుకున్నాడు. అలాంటిది గేమ్ ఛేంజర్ నిజంగా మేలో వస్తుందా? దీనికి కూడాగ్రాఫిక్స్ వర్క్ హెవీగానే ఉంది. చరణ్ డ్యూయెల్ రోల్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. ఇవన్నీచూస్తుంటే మే లోకాదు వచ్చే ఏడాది దసరాకే గేమ్ ఛేంజర్ వస్తుందా అన్న అనుమానాలు కూడా పెరిగాయి.