AP MLC Elections : ఆగస్టు 30న స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక..

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Elections) షెడ్యూల్ విడుదలైయింది.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఎమ్మెల్సీ ఎన్నికకు (MLC Elections) షెడ్యూల్ విడుదలైయింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో విశాఖపట్నం స్థానిక సంస్థల MLCగా YSRCP తరఫున గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ (Vamsikrishna Srinivas) గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆగస్టు 6న నోటిఫికేషన్ రానుండగా, అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన, ఆగస్టు 16న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.

ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక (By-election) జరగనుంది. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఉమ్మడి విశాఖపట్నంలో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్‌, మండల ప్రజాపరిషత్‌ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు.

Suresh SSM