Solar Plane: ఇంధనం లేకుండా ఎగిరే విమానం.. అందుబాటులోకి ఎప్పుడంటే..?

వైమానిక రంగంలో సరికొత్త మార్పులు రూపుదిద్దుకంటున్నాయి. వైట్ పెట్రోల్ తో నడిచే విమానాల మొదలు ప్రత్యేక ఆయిల్ ని వినియోగించి గగనతలంలోకి విహరించేలా చేయడం చూశాం. అయితే తాజాగా ఎలాంటి ఇంధనం లేకుండా కేవలం సౌర శక్తితో నడిచేలా దీనిని రూపొందించారు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు. మైకేల్ టాగ్నినీ అనే ఎయిర్ ఫోర్స్ పైలట్ ఇందులో ప్రయాణించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 12:13 PM IST

నేటి యుగంలో ఇంధనంతో నడిచే వాహనాల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. అన్నీ ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజన్ తో నడిచే మోటార్లు తయారవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్, బ్యాటరీతో నడిచే కారు, ఛార్జింగ్ పెట్టుకుని నడిచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే నిన్న,మన్నటి వరకూ విమానాలు ఇంధనంతో నడుస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజల్, ఆయిల్ వంటివి అవసరం లేకుండా పూర్తి సోలార్ తో తయారు చేశారు. ఈ సరికొత్త ప్రయోగానికి యూరోపియన్ శాస్త్రవేత్తలు నడుంబిగించారు. దీనికి ఎయిర్ షిప్ అని పేరు పెట్టారు.

ప్రయోగాత్మక విమానం..

సోలార్ శక్తిని వినియోగించుకుని నడిచే ఈ విమానం పొడవు 495 అడుగులు ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఈ సోలార్ విమానాల ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ఈ విమానం చాలా శక్తివంతమైనది, మెరుగైనదని పేర్కొన్నారు. భూమధ్య రేఖ చుట్టూ 40వేల కిలోమీటర్ల దూరాన్ని నిర్విరామంగా 20రోజుల్లో తిరిగి వచ్చిందని వివరించారు. సుమారు 51,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో సూర్యరశ్మిని గ్రహించే సోలార్ ప్యానెళ్లను దీని చుట్టూ అమర్చారు. ఇది ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ తో ప్రయాణిస్తుంది. ముగ్గురు పైటెట్లు కూర్చునేందుకు ప్రత్యేకమైన క్యాబిన్ రూపొందించారు.

ప్రత్యేకతలు..

  • 2026లో ప్రయాణీకులు విహరించేందుకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
  • గంటకు 83 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
  • సూర్యకాంతితో రాత్రి, పగళ్లు తేడాలేకుండా నింగిలో దూసుకెళ్తుంది.
  • సౌర కాంతిని హైడ్రోజన్ గా మార్చుకుంటుంది.
  • సాధారణ విమానాల కంటే పెద్దగా ఉంటుంది.
  • కార్గో విమానాల కంటే 10రెట్లు అధికంగా సరుకు రవాణా చేస్తుంది.
  • గాలిలో నిలిపి తిరిగి స్టార్ట్ చేయవచ్చు కనుక ప్రతిసారి రన్ వే తో అవసరం ఉండదు.

T.V.SRIKAR