పెళ్లి మనవా జీవితంలో అతి ముఖ్యమైన కార్యం, అంతకు మించి అతి ముఖ్యమైన ఘట్టం.. అనికూడా చెప్పవచ్చు. స్త్రీ, పురుష సంసార బంధానికి పెళ్లి అనేది సమాజం దృష్టిలో ఓ ధర్మబద్ధమైన పద్దతి.. పెద్దల సమక్షంలో తమ తమ మతాలకు అనుగుణంగా వివాహాలు జరుగుతాయి. కానీ నేటి సమాజంలో పెళ్లిళ్లు తిరోక్క రకాలుగా, చిత్ర విచిత్రంగా జరగడం చూస్తున్నాం.. అంటే సముద్రపు నీటి అడుగున, విమానంలో, ఆకాశంలో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఇలా పలురకాలుగా చూశాము.. కానీ ఇప్పుడు చూడబోయేది అలా ఇలా కాదండోయ్.. నా బుతో నా భవిష్యతి అన్నట్లుగా జరుగుతుంది. ఈ పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలిస్తే మీకు చుక్కలే..అర్థం కాలేదు కాదు.. అవును మీరు విన్నది నిజమే నిజంగా ఈ పెళ్లి జరిగేది చుక్కల్లోనే అంటే అంతరిక్షంలో అన్నా మాట. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. అది తెలియాలంటే ఇది చదవాల్సిందే మరీ.
కాసులు బట్టి కళ్లు చెదిరేలా పెళ్లి..
పూర్వం మన పెద్దలు పెళ్లిళ్లు చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని అంటారు. అంతే నా పెళ్లి అంటే ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేయాలి అంటూ ఊరంతా ఆశ్చర్యపోయేలా ఆర్భాటంగా జరగాలి అని అంటుంటారు. నేటి సమాజంలో అలాంటి ప్రస పదాలు పెళ్లిళ్లు జరగడం చాలా అరుదు.. నేడు ప్రపంచం గుర్తుపెట్టుకునేలా జరుగుతున్నాయి ఎక్కువ శాతం పెళ్లిళ్లు. కొందరు కాసులు బట్టి కళ్లు చెదిరేలా కళ్యాణ వేదికలు.. రికార్డుల కోసం అడపాదడపా పెళ్లిల్లు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు వినేది చూసేది మునుపెన్నడూ చూడలేనిది.. ప్రపంచము మరవలేని రీతిలో భిన్నంగా భూమండలం పై ప్రపంచము అంచు అంతరిక్షం నడుమన ఈరకైమన పెళ్లిళు జరగబోతున్నాయి. వింటుంటేనే చుక్కలు కనబడుతున్నాయి కాదు.. మరి నిజంగానే చుక్కలు చూస్తూ పెళ్లి చేసుకుంటే ఆ అనుబుతే వేరే లేవల్ అనుకోండి.
అంతరిక్ష నౌకలో ప్రయాణం, పెళ్లి ఎలా..?
ఇక విషయంలోకి వెళితే.. నెప్ట్యూన్ అనే కార్బన్ న్యూట్రన్ బెలూన్ అనే అంతరిక్ష వాహనం వధూవరులను అంతరిక్షింలోకి తీసుకెళ్తుంది. స్పేస్‌షిప్ నెప్ట్యూన్, ఫుట్‌బాల్ మైదానం పరిమాణం మరియు నిలబడి ఉన్నప్పుడు 700 అడుగుల పొడవు ఉంటుంది. పునరుత్పాదక హైడ్రోజన్ సాయంతో ఇది పనిచేస్తుంది. దీనికి పరిమిత సంఖ్యలో మాత్రమే జనాలు అనుమతిస్తున్నారు. దీంతో ఇందులో పైలెట్ తో పాటు ఒకేసారి ఎనిమిది మంది ప్రయాణం చేయడానికి వీలుగా ఈ వాహనం రూపొందించారు. భూమి నుంచి అక్షరాల లక్ష అడుగుల ఎత్తులో వెళ్లి.. అక్కడ వివాహం పూర్తయ్యాక తిరిగి కిందకు రావడానికి నెప్ట్యూన్ కు ఆరు గంటల సమయం పడుతుంది. భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాక పెద్ద సైజు గాజులు అద్దాల ద్వారా అక్కడి నుంచి 360 డిగ్రీల కోణంలో భూమిని వీక్షించొచ్చు. అంతేనా.. ఇందులో అత్యాధునిక సదుపాయాలతో కూర్చుని సేద తీరడానికి కుర్చీలు, సోఫాలు, డైనింగ్ హాల్, వాష్ రూం వంటి సదుపాయాలు ఉంటాయి. మారి పెళ్లి అంటే ధూమ్ ధామ్ గా ఉండాలి అందుకు కావాల్సిన సౌండ్ ట్రాక్, మైమరిపించే రంగురంగుల లైటింగ్ , బాత్రూం వంటి సౌకర్యాలతో 2024లో మొదటి స్పేస్ వెడ్డింగ్ లో నిర్వహించేందుకు స్పేస్ పర్ స్పెక్టివ్ సంస్థ సిద్దమైంది.పెళ్లి అంటే పది మందికి తెలియాలి, పదిమంది చూడాలి అంటారు. మరో 8 మంది మాత్రామే అనుమతి ఉన్న ఈ అంతరిక్ష నౌకలో ఎలా అనుమతిస్తుంటారు అని ప్రశ్న తలెత్తుంది కాదూ. దానికి వీలుగా “స్పేస్ పర్ స్పెక్టివ్ సంస్థ” వై-ఫై సదుపాయాన్ని అందిస్తుంది. మిగిలిన వారు కుటుంబ సభ్యులు, స్నేహితులు వీడియో కాల్ ద్వారా అంతరిక్షంలో జరుగుతున్న పెళ్లి వేడుకను స్మార్ట్ గా స్మార్ట్ ఫోన్ లో చూడొచ్చు.
ఈ అంతరిక్షపెళ్లి చేసుకోవాలంటే ఒక్కొక్కరికి ఎంత ఖర్చు..?
అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలంటే (ఒక్కో ప్రయాణీకుడి ధర $1,25,000) ఒక్కొక్కరికి కోటి రూపాయల దాకా ఖర్చు అంటే ఒక్క వివాహ జరగాలంటే పూర్తిగా 8 కోట్లు ఖర్చు అవుతుందని ‘స్పేస్ పర్ స్పెక్టివ్ సంస్థ’ స్పష్టం చేసింది. అంత ఖర్చు పెట్టి ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే మీరు ఇంకా స్పేస్ నుంచి కింద పడినట్లే. ఎందుకంటే ఇప్పటికే ఈ అంతరిక్ష బెలూన్ కు వెయ్యికి పైగా బుకింగ్స్ అయ్యాయి. అంటే వెయ్య కుటుంబాలు, వెయ్య పెళ్లిళ్లు అంతరిక్షంలో చేసుకోవాడానికి వెయిటింగ్ చేస్తున్నట్లే కదా..
S.SURESH