భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాకా.. మాన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలి సారి. దీంతో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పబోతున్నారు అని దేశ వ్యాప్తంగా ప్రజలు చాలా అసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మార్చిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇన్నాళ్లు మన్ కీ బాత్ కార్యక్రమం వాయిదా పడింది. దాదాపు మూడు నెలల విరామం తర్వాత నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతున్నారు. ఈ మాన్ కీ బాత్ కార్యక్రమం 2014 అక్టోబర్ 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. అప్పటి నుంచి ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఈ కార్యక్రమం ద్వారా ప్రజలనుద్దేశించి మోదీ తన మనసులోని మాటలను పంచుకుంటున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ప్రారంభంమైయింది. ‘మన్ కీ బాత్’ అనేది భారత పౌరులతో కీలకమైన జాతీయ సమస్యలను చర్చించడానికి ప్రధానమంత్రి మోదీ వేదికగా ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమవుతుంది. జూన్ 18న, జూన్ 30న మన్ కీ బాత్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు PM మోడీ ప్రకటించారు. MyGov ఓపెన్ ఫోరమ్, NaMo యాప్ ద్వారా లేదా 1800 11 7800లో సందేశాలను రికార్డ్ చేయడం ద్వారా ప్రజలు తమ ఆలోచనలను అందించాల్సిందిగా ప్రోత్సహించారు.
దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియోకు ఉన్న 500 బ్రాడ్ కాస్టింగ్ సెంటర్ల ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 22 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, చైనీస్, అరబిక్ వంటి 11 విదేశీ భాషల్లోకి కార్యక్రమాన్ని ప్రసారం అవుతున్నాయి..
‘మన్ కీ బాత్’ 111వ ఎపిసోడ్ హైలైట్స్ ఇవే…