Telangana, Temperature తెలంగాణలో పెరుగుతున్న ఎండలు..

తెలంగాణలో (Telangana) ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్‌కు (Degrees Celsius) పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. హైదరాబాద్‌ (Hyderabad) లోనూ 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలంగాణలో (Telangana) ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్‌కు (Degrees Celsius) పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. హైదరాబాద్‌ (Hyderabad) లోనూ 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్‌(Mahbubnagar) , మెదక్‌(Medak) , భద్రాచలం, హనుమకొండ ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత కనిపిస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్, రామగుండంలలో సాధారణం(14 డిగ్రీలు) కన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కోస్తా, ఉత్తరాంధ్రలో కూడా ఎండలు పెరుగుతున్నాయి. ఏపీలో రాత్రివేళ సాధారణ 21 డిగ్రీల సెల్సియస్ ఉంది. పగటివేళ అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 12 నుంచి 27 C కిలోమీటర్లుగా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోకి గాలి వేగం సాధారణంగానే ఉంది.