స్వలింగ వివాహాల చట్టబద్దతపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి గత 5 నెలల క్రితమే వాదనలు జరిపింది. సుదీర్ఘ వాదనల తరువాత తీర్పును మే 11న రిజర్వ్ చేసి ఉంచారు. దీనిపై పార్లమెంట్ ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.
స్వలింగ సంపర్కాలు విదేశాల్లో సాధారణమైన చర్యే అయినప్పటికీ మన దేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఈ వివాహాలకు సంబంధించి చట్టబద్దతను కల్పించాలని కూరుతూ దాదాపు 20 కిపైగా పిటిషన్లు దాఖలైనట్లు తెలిపారు. హోమో సెక్సువాలిటీ అనేది కేవలం కొన్ని నగరాలను, ఉన్నత వర్గాలకు మాత్రమే చెందిన అంశం కాదని భారత అత్యున్నత న్యాయమూర్తి చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగకుండా వాటిని పరిరక్షించే విధంగా ఉండాలని భావించారు.
సుప్రీం కోర్టు వెలువరించే తీర్పు అధికారాల విభజనకు అడ్డంకిగా మారకూడదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే చట్టసభల్లో దీనిపై చర్చ జరిపేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పార్లమెంట్ తీసుకునే నిర్ణయం న్యాయసమీక్షలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్దంగా పరిగణలోకి తీసుకోవచ్చన్నారు. ఈ కేసుపై తీర్పును ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం వెలువరించింది. ఇందులో సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్ కే కౌల్, రవీంద్ర భట్, హిమ కోహ్లీ, పీఎస్ నరసింహలు ఉన్నారు.
T.V.SRIKAR