Chandrababu: చంద్రబాబు కేసులో మంగళవారం కీలకం కానుందా.. నేడు సుప్రీం కోర్టులో ఏం జరగనుంది..?

చంద్రబాబు స్కిల్ సహా అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు, అంగళ్లు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈరోజు ఒక స్పష్టత రానుంది. సుప్రీం కోర్టు మొదలు ఏసీబీ కోర్టు వరకూ అన్ని చోట్ల మంగళవారం చంద్రబాబు కేసులు విచారణకు రానున్నాయి. ఈరోజు చంద్రబాబుకు కీలకంగా మరానుంది. 

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 09:01 AM IST

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును ఏసీబీ కోర్ట్ రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే హై కోర్ట్ లో వేసిన క్వాష్ పిటీషన్ సహా బెయిల్ పిటీషన్ పై ఈరోజు ఏసీబీ, సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. సోమవారమే విచారణ జరగాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా వేస్తూ సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు లో రద్దు చేసిన క్వాష్ పిటీషన్ ఇక్కడ చర్చకు వస్తుందా.. అత్యున్నత న్యాయస్థానం దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా.. ఈయన మాజీ ముఖ్యమంత్రి అని తెలిపుతూ సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని పిల్ దాఖలు చేశారు. దీనిని గతంలో ఏపీ హైకోర్టులో చర్చ జరగగా ప్రాధమిక ఆధారాలు ఉండి, కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఇలా చేయడం సరికాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తూ క్వాష్ పిటీషన్ ను కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది.

హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిల్

ఈ కేసు చాలా త్రీవమైనదని, హైలెవెల్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి అని, అత్యవసరంగా ఈ కేసును విచారణ చేపట్టాలని సిద్దార్థ్ లూథ్రా న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనాన్ని కోరారు. అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం రిమాండులో ఉన్న తన పిటీషినర్ ను అణచివేసేందుకు ప్రయత్న చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈక్రమంలో న్యాయమూర్తికి, లూథ్రాకి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఎప్పటి నుంచి ఆయన కస్టడీలో ఉన్నారన సీజేఐ ప్రశ్నించారు. దీనికి బదులుగా సిద్దార్థ్ లూథ్రా సెప్టెంబర్ 8 నుంచి అన్నారు. అప్పుడు స్పందించిన డీవై చంద్రచూడ్ ధర్మాసనం 8 నుంచా అని ప్రశ్నిస్తూ రేపు మెన్షనింగ్ లో రండి అని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో మంగళవారం చంద్రబాబు కేసు కీలకమలుపు తిరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

ఏపీలో రెండు పిటిషన్లు..

ఇవిలా ఉంటే ఏపీ హై కోర్టులో, ఏసీబీ కోర్టులో మరిన్ని పిటిషన్లు వేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కుంభకోణం, అంగళ్లు వింధ్వంసం కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏ1గా ఉన్నట్లు తెలిపారు న్యాయవాదులు. వీటిపై ఈరోజు హై కోర్టులో విచారణ జరుగనున్నట్లు సమాచారం. అలాగే ఏసీబీ కోర్టులో చంద్రబాబు ను సీఐడీ 5 రోజులు విచారణ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే క్రమంలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ తరఫు న్యాయవాదులు పిటిషన్లు వేశారు. దీనిపై కూడా చర్చ జరుగనుంది.

T.V.SRIKAR