Telangana Elections : ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు..

తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్‌ మూమెంట్‌ స్టార్ట్‌ అయ్యింది. మరో 45 రోజుల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాబోతోంది. మరోసారి అధికారం కోసం బీఆర్‌ఎస్‌.. ఈసారి జెండా పాతి తీరాలని బీజేపీ కాంగ్రెస్‌. ఎవరికి వాళ్లు వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ లకు ఓకే కానీ.. బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రం ఎవరికీ చెప్పుకోలేని ఓ కష్ట వచ్చింది.

తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్‌ మూమెంట్‌ స్టార్ట్‌ అయ్యింది. మరో 45 రోజుల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాబోతోంది. మరోసారి అధికారం కోసం బీఆర్‌ఎస్‌.. ఈసారి జెండా పాతి తీరాలని బీజేపీ కాంగ్రెస్‌. ఎవరికి వాళ్లు వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ లకు ఓకే కానీ.. బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రం ఎవరికీ చెప్పుకోలేని ఓ కష్ట వచ్చింది. అదే ఎలక్షన్‌ సింబల్‌. సాధారణంగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకలకు పర్మనెంట్‌ సింబల్‌ను కేటాయిస్తాయి. అలాగే బీఆర్‌ఎస్‌కు కారు గుర్తు, కాంగ్రెస్‌కు హస్తం గుర్తు, బీజేపీకి కమళంపువ్వు గుర్తు ఉన్నాయి. ఇవి కాకుండా ఇండిపెండెంట్‌ క్యాండెట్లకు కేటాయించేందుకు ఫ్రీ సింబల్‌ జాబితాను కూడా ఈసీ సిద్ధం చేస్తుంది.

ఈ ఫ్రీ ఎన్నికల జాబితా లిస్ట్‌లో కారు గుర్తును పోలిన చాలా గుర్తులు ఉన్నాయి. రోటీ మేకర్‌, రోడ్‌ రోలర్‌, గ్యాస్‌ స్టవ్‌, ఇలాంటి చాలా గుర్తులు ఈవిఎంలో కారు గుర్తులానే కనిపిస్తాయి. దీంతో చాలా మంది.. ముఖ్యంగా గ్రామాల్ల వృద్ధలు ఆ సింబల్స్‌ చూసి కారు గుర్తు అనుకుని ఓటేస్తుంటారు. గతంలో ఇలా చాలా సార్లు జరిగింది. హుజురాబాద్‌ బైపోల్‌లో కూడా రోటీ మేకర్‌ కారణంగాన బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద మొత్తంలో ఓట్లు కోల్పోయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఆ తప్పును జరగనివ్వకూడదని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించుకుంది. ఫ్రీ సింబల్‌ జాబితా నుంచి కారును పోలి ఉన్న గుర్తులను తొలగించాలంటూ ఎన్నికల కమీషన్‌ను బీఆర్‌ఎస్‌ ఎంపీలు కోరారు. వాళ్ల అభ్యర్థను స్వీకరించినా.. ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. దీంతో సేమ్‌ డిమాండ్‌తో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈ టైంలో ఎలక్షన్‌ సింబల్‌ లిస్ట్‌ను సవరించలేమంటూ తేల్చిచెప్పింది. కారు గుర్తును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్‌ జాబితా నుంచి తీసివేయడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్‌లో ఉంది. ఈ ఎన్నికల్లో కూడా కారు గుర్తున పోలిన గుర్తులు చాలా మంది ఇండిపెండెంట్‌ క్యాడెంట్లకు కేటాయించబోతోంది ఎలక్షన్‌ కమిషన్‌. దీంతో ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలకు కారు గుర్తును మరింత క్లియర్‌గా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. దీంతో కారు గుర్తుకు, దాన్ని పోలి ఉన్న గుర్తులపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించే కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు.