లడ్డూ కల్తీపై సుప్రీం కోర్ట్ సూటి ప్రశ్నలు చంద్రబాబాబు,పవన్ కు షాక్?

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం ముందు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Written By:
  • Updated On - September 30, 2024 / 09:05 PM IST

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం ముందు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నెయ్యి లోపలికి వచ్చే ముందు టెస్టింగ్‌కు ఒక మెకానిజం ఉంది అని… సీఎం, ఈవో చేసిన కామెంట్స్‌ వేర్వేరుగా ఉన్నాయి అని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని పిటిషనర్ల తరపు లాయర్లు పేర్కొన్నారు. భక్తులు గందరగోళానికి గురయ్యారని కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు.

సుబ్రమణ్యస్వామి తరపు న్యాయవాది… లడ్డూ వివాదంలో శ్రీవారి భక్తులకు ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయని ప్రసాదంలో పదార్థాలు కలుషితమయ్యాయని సీఎం ప్రకటన చేశారని పేర్కొన్నారు. ఆరోపణల అనంతరం టీటీడీ అధికారి కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారన్నారు. సీఎం ప్రకటన వివాదాస్పదమైంది అంటూ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. కల్తీ నెయ్యి వంద శాతం వాడలేదని టీటీడీ అధికారి చెబుతున్నారన్నారు. అన్ని అంశాలపై సుప్రీం పర్యవేక్షణలో విచారణ జరపాలని కోర్ట్ ని కోరారు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నెయ్యి రిపోర్ట్ పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని నిలదీసింది కోర్ట్. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండని కోరింది కోర్ట్. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించండని కోర్ట్ ఆదేశించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్‌కు పంపారా? అని ప్రశ్నించిన కోర్ట్ ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు? అని నిలదీసింది. లడ్డూలను ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మైసూర్‌ లేదా గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు అని నిలదీసింది. కల్తీ నెయ్యిని లడ్డూ వినియోగంలో వాడినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది కోర్ట్.