Train Moving: ఇంజన్ లేకుండా కదిలిన రైలు.. భయాందోళనలో ప్రజలు

సాధారణంగా రైళ్లు ముందుకు, వెనుకకు షంటింగ్ కొడుతూ ఉంటాయి. ఇలాంటి సన్నివేశాలు రైల్వే ప్లాట్ ఫాం పై చూస్తూ ఉంటాము. షెడ్డులో నుంచి బయటకు వచ్చిన రైలు కొంత దూరం ముందుకు వెళ్లి దానికి కేటాయించిన ఫ్లాట్ ఫాం పైకి రివర్స్లో వచ్చి నిలబడుతుంది. కానీ ఇక్కడ ఇంజన్ లేకుండానే రైలు వెనుకకు ప్రయాణించింది. ఈ ఆసక్తికరమైన సన్నివేశం ఎక్కడ చోటు చేసుకుందో ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 12:56 PM IST

జార్ఖండ్ రాష్ట్రంలో ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని సాహిబ్ గంజ్ జిల్లాలో ఉండే మాల్దా రైల్వే డివిజన్ లో ఈ అసాధారణమైన సంఘటన చోటు చేసుకుంది. ఎరువులు, సరుకులు లోడింగ్, అన్ లోడింగ్ చేసే ప్రాంతంలో ఒక వ్యాగన్, నాలుగు బోగీలు ఆగి ఉన్నాయి. ఉన్నట్టుండి ఎవరో రైలును ముందుకు నెట్టినట్టుగా బండి మొత్తం కదిలింది. అలా కదులుతూ వెనుకకు దొర్లుకుంటూ రావడంతో స్థానింగా ఉన్న ప్రజలు ముందుగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు ముందు భాగంలో ఇంజన్ ఉందేమో గూడ్స్ ను వెనుకకు తీసుకొస్తున్నారేమో అనుకున్నారు. కానీ ఈ గూడ్స రైలు పూర్తిగా వెనుకకు పరుగులు పెడుతూ దాదాపు కొన్ని మీటర్ల దూరం ప్రయాణించింది. గూడ్స్ రైలు కు ముందు, వెనుక ఎక్కడా ఇంజన్ లేకపోవడాన్ని గుర్తించారు స్థానికులు, రైల్వే అధికారులు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు స్టేషన్ యాజమాన్యం. అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దానిపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చేరవేశారు.

ఆగి ఉన్న గైడ్స్ రైలు బోగీలు వాటంతట అవే ఎలా కదిలాయి అన్న కోణంలో విచారణ చేపట్టారు రైల్వే ఉన్నతాధికారులు. ఇదిలా ఉంటే అక్కడ ఈవింత ఘటనను చూసేందుకు వచ్చిన వాళ్లు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీనిని చూసిన కొందరు నెటిజన్లు రకరకాలగా స్పందించారు. రైల్వే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా.. అదే సమయంలో ఎవరైనా ట్రాక్ పై నడుస్తూ వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి.. లేదా మరో రైలు అటువైపుగా వచ్చి ఉంటే మరో రైలు ప్రమాదం జరిగేదని కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా రైల్వే అధికారులు, సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

T.V.SRIKAR