I News Channel, Shravan : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్‌.. ట్యాపింగ్‌ ఎక్కడి నుంచి జరిగిందంటే..

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తవ్వుతున్నకొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న స్టెట్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు (DSP Praneet Rao) పోలీసులకు ఒక్కొక్కటిగా నిజాలు చెప్పేస్తున్నారు.

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తవ్వుతున్నకొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న స్టెట్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు (DSP Praneet Rao) పోలీసులకు ఒక్కొక్కటిగా నిజాలు చెప్పేస్తున్నారు. ఇప్పటికే ట్యాప్‌ చేసిన ఫోన్లన్నీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే చేసినట్టు ఒప్పుకున్నారు. తాము చేసిన తప్పు బయటికి రాకుండా ఉండేందుకే ఆధారాలు ధ్వంసం చేసినట్టు కూడా ఒప్పుకున్నారు. ప్రణీత్‌ రావు ఇచ్చిన సమాచారంతో కొన్ని ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు ప్రణీత్‌ రావు. ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping) వ్యవహారంలో ఓ మీడియా ఛానెల్‌ ఎండీ తనకు సహకరించినట్టు వెల్లడించాడు.

ఐన్యూస్‌ ఛానల్‌ (I News Channel) ఎండీ (MD) శ్రవణ్‌ (Shravan) రావు ఈ విషయంలో తనకు హెల్స్‌ చేశాడని చెప్పాడు. ఐన్యూస్‌ కార్యాలయం బిల్డింగ్‌లోనే ఓ సర్వర్‌ రూం ఏర్పాటు చేసి అక్కడి నుంచే ట్యాపింగ్‌ చేసినట్టు చెప్పాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు, ప్రముఖులు, జర్నలిస్ట్‌లు (Journalist), పొలిటీషియన్స్‌.. ఇలా చాలా మంది ఫోన్లను ఐన్యూస్‌ ఆఫీస్‌ నుంచే ట్యాప్‌ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో పోలీసులు శ్రవణ్‌ రావును టార్గెట్‌ చేశారు. వెంటనే ఐన్యూస్‌ కార్యాలయంతో పాటు శ్రవణ్‌ రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. కానీ పోలీసులు వెళ్లేటప్పటికే శ్రవణ్‌ రావు పారిపోయాడు.

ప్రస్తుతం అంతను లండన్‌కు పారిపోయినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. కార్యాలయంతో పాటు శ్రవణ్‌ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. దొరికిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్‌ రావు ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో కేసు ఈ కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రణీత్‌ రావు చెప్పిన ప్రాంతం నుంచి ఇప్పటికే కొన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారం వెనక ఖచ్చితంగా గత ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ప్రస్తుంతం అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.