ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనున్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ ఇది రెండో సారి సమావేశం కానుంది. ఢిల్లీలో నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరునుంది. కాగా ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ నిర్వహించారు కేంద్ర కేబినెట్ సభ్యులు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సారి కేబినెట్ భేటీ కాబోతుంది
ముఖ్యంగా ప్రధాని 3.0 కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాకా.. కాశ్మీర్ లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అందులోను మరీ పని గట్టుకోని యాత్రికులు.. టూరిస్ట్ పై ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు అమాయక ప్రజలు దుర్మరణం పాలయ్యారు. కాగా వరుస దాడులతో కేంద్ర హోం శాఖ, కేంద్ర మంత్రి అమిత్ షా జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులపై ప్రతి చర్యలు ప్రారంభించారు. కాగా నేడు ఈ సమావేశంలో ఉగ్రదాడులపై వారిని ఎదుర్కొనేందుకు వాటిని అరికట్టేందుకు సూచనలు కేంద్ర రక్షణ శాఖ, హోం శాఖకు ఆదేశాలు జారీ చేయనున్నారు భారత ప్రభాని నరేంద్ర మోదీ.