Stoke On Trent: ఒక నదిలో రెండు రంగులు.. ఎక్కడో తెలుసా..?

నదులు జీవనాధారాలు. వీటిలో కొన్ని ఏడాదంతా ప్రవహిస్తే మరికొన్ని కాలాను గుణంగా పరవళ్లుతొక్కుతాయి. కొన్ని జీవనదులు, ఉపనదులు, ప్రాంతీయ నదులు ఉంటాయి. సామాజిక శాస్త్రంపై కాస్త అవగాహన ఉంటే వీటి గురించి తెలుస్తుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ నది గురించి సామాన్యులకు అవగాహన రాలేదు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఉన్న పళంగా రంగులు మారిపోయాయి కాబట్టి. నదులు ఇలా రంగులు మారుతాయా.. ఒక వేళ మారితే ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - July 19, 2023 / 06:32 PM IST

మన దేశంలో చాలా నదులు వర్షాలకాలంలో మట్టి వర్ణంలో కనిపిస్తాయి. దీనికి గల కారణం వర్షపు నీరు. ఎక్కడో మట్టి పేరుకుపోయిన ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం జరగడం వల్ల కాఫీ లేదా టీ రంగులో ప్రవహించే నీటిని మనం చూస్తూ ఉంటాం. వీటినే మట్టి నీళ్లు అని కూడా పిలుస్తారు. అలా కాకుండా నారింజ, నీలం రంగులో మారి ప్రవహిస్తే కాస్త వింతగా ఉంటుంది. మరి కొందరికి భయంగా కూడా ఉంటుంది. ఇలాంటి సంఘటనే యూకే లో చోటు చేసుకుంది. ఒక నది అమాంతం నీలం, ఆరెంజ్ రెండు వర్ణాల్లో కనిపించింది.

బ్రిటన్ లోని స్టఫోర్డ్ ఫైర్ లోని ట్రెంట్ నదిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం బ్రిటన్ మొత్తం చర్చనీయాంశంగా మారింది. దీనిని చూసేందుకు కొందరు ఆసక్తి చూపితే మరికొందరు అందులోని చేపలు ఇతర జలచరాలు ఏమైపోయాయో అని తీవ్రమైన ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన బ్రిటన్ ప్రభుత్వం సత్వరమే ఈ నది ఇలా మారడానికి గల కారణాలను విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పర్యావరణ శాస్త్రవేత్తలు ఈనీటిని పరిశీలించారు. బట్టలకు సంబంధించిన రంగులు పొరపాటున ఇందులో పడిపోవడంతో నీరు ఇలా రెండు రకాల రంగుల్లో మారిందని గుర్తించారు. ఇలా మారిన రంగులో ఎలాంటి కెమికల్స్ లేవని పేర్కొన్నారు. తద్వారా నదిలో నివసించే జలచరాలకు ఎలాంటి ప్రాణ హానిలేదని తెలిపారు. అయితే ఒక రకంగా నది ఇలా మారిపోయినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు అధికారులు.

ఈ నది చుట్టూ పర్యావరణం అత్యంత సుందరంగా రమణీయంగా ఉంటుంది. వీటిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు కాసేపు ఆందోళనకు గురైయ్యారు. ఇదిలా ఉంటే కొందరు పర్యవరణ ప్రేమికులు మాత్రం ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొందరైతే ఏమైపోతుందో అని ఆశ్చర్యానికి గురైయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో పర్యవరణం ఏజన్సీ అధికారులు నిఘా పెంచి ఎన్నడూ లేనిది ఇప్పుడు ఇలా ‎ఎందుకు జరిగిందన్న దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

T.V.SRIKAR