హైదరాబాద్ లో ఒక్కసారిగా మరిపోయిన వాతావరణం..
ఉదయం నుంచే దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయిన వర్షం దాదాపు గంటసేపు పడింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురియడంతో నగరవాసులు ఉపశమనం పొందారు. ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కొంత ఈరోజు హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది.
హైదరాబాద్ లోని పలు నగరంలో వర్షం కురిసింది. బాలాపూర్, బర్కత్‌పుర, అబిడ్స్, సికింద్రాబాద్, కార్వాన్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గోల్కొండ, టోలిచౌకి, ఫిలింనగర్, మాదాపూర్, మెహిదిపట్నం, రైతు బోలి, అత్తాపూర్, పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. షేక్‌పేట్, మణికొండ, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతోంది. ఈ వర్షంతో ఇన్ని రోజులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులు కాస్త కూల్ అయ్యారు.