Mukesh Ambani : గెస్ట్‌ల కోసం 100 విమానాలు, 1000 రోల్స్‌ రాయ్స్‌ కార్లు

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఈ పెళ్లికి అంబానీ చేసిన ఏర్పాట్లు అలాంటివి మరి.

 

 

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఈ పెళ్లికి అంబానీ చేసిన ఏర్పాట్లు అలాంటివి మరి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. 12 నుంచి 14 వరకూ ముంబైలో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖులతోపాటు దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరయ్యారు. దీంతో వీళ్లకు సలక సౌకర్యాలు ముంబైలో ఏర్పాటు చేశారు అంబానీ. ముఖ్యంగా ప్రత్యేక అతిథులను తీసుకువచ్చేందుకు అంబానీ 3 ఫాల్కన్‌ జెట్‌లు, 100 విమానాలు బుక్‌ చేశారు. క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా అంబానీ జెట్‌ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు స్వయంగా చెప్పారు.

ఇక ఈ అతిథులను ఎయిర్‌పోర్ట్‌ నుంచి హోటల్‌కు తీసుకువెళ్లేందుకు కూడా వేల సంఖ్యలో లగ్జరీ కార్లను అంబానీ రెంట్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది. అనంత్‌-రాధిక పెళ్లి సందర్భంగా జులై 12-15 వరకు ముంబయిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. సౌదీ అరామ్‌కో సీఈవో అమిన్ నాసర్, HSBC గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్, భారతీయ సంతతికి చెందిన అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖేల్ గ్రిమ్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ జే లీ, ముబాదలా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్, బీపీ సీఈఓ ముర్రే అనంత్‌ పెళ్లికి ముఖ్య అతిథులుగా వచ్చారు.

ఇక దేశంలోని అన్ని భాషల నటులు ఈ పెళ్లిలో సందడి చేశారు. రాజకీయ, క్రీడా ప్రముఖులంతా అంబానీ పెళ్లిలో మెరిషారు. అనంత్-రాధికల పెళ్లి నేపథ్యంలో ముంబైలోని హోటల్స్ గదుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినట్లు కొన్ని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నాయి. సాధారణ రోజులలో ముంబైలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌లోని గదుల ఛార్జీ ఒక రాత్రికి సుమారు 13 వేలుగా ఉండేది. కానీ అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు లక్షకు పెంచినట్లు తెలుస్తోంది. జులై 12న ‘శుభ్‌ వివాహ్‌’, జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్‌’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగియనున్నాయి.