ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుక విశాఖ రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరుతుంది. ముందు వెల్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య తలెత్తడంతో కంటకపల్లి నుంచి పలాస రైలు చాలా నెమ్మదిగా ట్రాక్ పై కదులుతుంది అని ప్రయాణికులు చెప్తున్నారు. ఈ అదే సమయంలో వెనుక నుంచి రైలు ఢీకొన్నట్లు రైలు ప్రయాణికులు వివరించారు.రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. 17 గంటలకు పైగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఈ ప్రమాదం లో మృతుల సంఖ్య 14 మృతి, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఘటన పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ ఆరా తీస్తున్నారు.
ప్రమాద ఘటనపై హెల్ప్ లైన్ నంబర్లు..
- హెల్ప్ లైన్లు : 0891 2746330, 0891 2744619
- గూడూరు హెల్ప్ లైన్ నంబర్ : 9494178434
- ఏలూరు హెల్ప్ లైన్ నంబర్ : 0881-2232267
- రాజమండ్రి హెల్ప్ లైన్ నంబర్ : 08854-252172
- హెల్ప్ లైన్లు : 81060 53051, 8106053052, 8500041670, 8500041671
- రైల్వే హెల్ప్ లైన్లు : 83003 83004, 85005 85006
- వాల్తేరు హెల్ప్ లైన్ నంబర్ : 0891- 2885914
- అనకాపల్లి హెల్ప్ లైన్ నంబర్ : 08924221698
- భువనేశ్వర్ హెల్ప్ లైన్లు : 0674-2301625, 2301525, 2303069
- భువనేశ్వర్ : 06742301625, 06742301525, 06742303060, 06742303729
- వాల్తేరు టెస్ట్ రూం : 89780 80805
- సీనియర్ సెక్షన్ ఇంజినీర్ : 89780 80815
- వాల్తేరు డివిజన్ : 08942286245, 08942286213
- అలమండ, కంటకాపల్లి : 89780 81960
- విజయనగరం : 08922221206, 08922221202, 89780 80006
- శ్రీకాకుళం రోడ్డు : 08942286213, 08922286245
- ఏలూరు : 08812232267
- సామర్లకోట : 08842327010
- రాజమహేంద్రవరం : 08832420541
- తుని : 08854252172
దారి మళ్లించిన రైళ్లు ఇవే..
- బరౌనీ కోయంబత్తూరు మధ్య నడిచే రైలును తిల్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లారా, విజయవాడ మీదుగా మళ్లింపు
- నగర్ ఎర్నాకుళం రైలును గొట్లం, తిల్లినగర్, నాగ్ పూర్, విజయవాడ మీదుగా మళ్లింపు
- భువనేశ్వర్ ముంబై మధ్య నడిచే రైలును రద్దు చేశారు.
- పూరి తిరుపతి మధ్య నడిచే రైలును బాలుగావ్ వరకు మళ్లింపు
- ముంబై భువనేశ్వర్ మధ్య నడిచే రైలులు విశాఖ పట్నం వరకే నడుపుతారు.
- భువనేశ్వర్ ముంబై రైలును విజయనగరం, తిత్తినగర్, రాంచీ, నాగ్ పూర్, కాజీపేట మీదుగా మళ్లింపు
- హౌరా సికింద్రాబాద్ రైలును విజయనగరం తల్లిఘర్ రాంచీ, నాగ్ పూర్ కాజీపేట మీదుగా మళ్లింపు
- బెంగుళూరు రైలును విజయనగరం, తిల్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లింపు
ఈ ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.
రద్దయిన రైళ్లు..
- కోర్బా – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18517) ,
- పారాదీప్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (22809)
- రాయగడ – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08503)
- పలాస – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08531)
- విశాఖపట్నం – గుణుపుర్ ప్యాసింజర్ స్పెషల్ (08522)
- గుణుపుర్ – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08521)
- విజయనగరం – విశాఖపట్నం మెమూ స్పెషల్ (07469)
- విజయవాడ – విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718)
- విశాఖ – విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717)
- గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (12739)
- కాకినాడ – విశాఖ మెమూ ఎక్స్‌ప్రెస్ (17267)
- విశాఖ – కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్ (17268)
- రాజమండ్రి – విశాఖపట్నం మెమూ స్పెషల్ (07466)
- విశాఖపట్నం – రాజమండ్రి మెమూ స్పెషల్ (07467)
- కోరాపుట్ – విశాఖపట్నం స్పెషల్ (08545)
- విశాఖపట్నం – కోరాపుట్ స్పెషల్ (08546)
- పలాస – విశాఖపట్నం స్పెషల్ (08531)
- చెన్నై – పూరి ఎక్స్‌ప్రెస్ (22860)
- రాయగడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244)
SURESH