ఐపీఎల్ మెగా వేలం రసవత్తరంగా సాగుతోంది. ఊహించనిట్టుగా కొందరు స్టార్ ప్లేయర్స్ తో పాటు ఊహించని విధంగా మరికొందరు ప్లేయర్స్ పై కోట్లాభిషేకం కురిసింది. తొలిరోజు వేలంలో పంత్, శ్రేయాస్ అయ్యర్ తో పాటు వెంకటేశ్ అయ్యర్ పేరు మారుమోగింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన వెంకటేష్ అయ్యర్ ను కొనేందుకు ఆర్సీబీ, కేకేఆర్ జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. రెండు కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలో నిలిచిన వెంకటేశ్ అయ్యర్ ను కోనేందుకు ఆయన పాత జట్టు కేకేఆర్ పోటీలో నిలవగా.. ఆర్సీబీ కూడా అతన్ని సొంతం చేసుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చిట్ట చివరికి వెంకటేష్ అయ్యర్ ను కోల్ కత్తా ఏకంగా 23.75 కోట్లకు దక్కించుకుంది.. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన మూడో ప్లేయర్ గా నిలిచాడు.