Chandrayaan-3: ఆస్ట్రేలియా తీరంలో చంద్రయాన్‌-3 శకలం !?

నిన్నటి నుంచి ఇంటర్నెట్‌లో ఓ రాకెట్‌కు సంబంధించిన శకలం వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని గ్రీన్‌హెడ్‌ తీరంలో ఈ శకళలాన్ని గుర్తించారు. దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో ఎవరినీ దాని దగ్గరికి వెళ్లనివ్వడంలేదు. అయితే అంతా ఇది ఇండియా ప్రయోగించిన చంద్రయాన్‌-3ని మోసుకెళ్లిన రాకెట్‌ ఎల్‌ఎంవీ-3/ఎం4 కు చెందిన పార్ట్‌గా భావిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 01:46 PM IST

నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 ఆస్ట్రేలియా గగనతలం గుండానే వెళ్లింది. ఆ క్రమంలోనే ఇది రాకెట్‌ నుంచి విడిపోయి ఈ బీచ్‌లో పడిపోయి ఉండొచ్చంటున్నారు. ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ కూడా దీని గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఓ టీం ఇదేంటి అన్న విషయం తెలుసుకునేందుకు వర్క్‌ చేస్తున్నారు. చూసేందుకు సిలిండర్ ఆకారంలో ఉన్న ఈ వస్తువు 2.5 మీటర్ల పొడవు.. 3 మీటర్ల వెడల్పు ఉంది. ఈ విషయంపై ఇస్రో కూడా ఇప్పటి వరకూ ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వలేదు. ఇది రాకెట్‌కు సంబంధించిన మూడో దశ శకలమై ఉంటుందని కొందరు చెబుతున్నారు. రాకెట్స్‌లో బూస్టర్లు దశలుగా ఉంటాయి. ఇంజిన్ బూస్టింగ్‌ ముగిసిన తర్వాత రాకెట్‌ నుంచి అవి విడిపోయి సముద్రంలో పడిపోతుంటాయి.

ఈ వస్తువు గత 12 నెలల్లో హిందూ మహాసముద్రంలో పడిపోయిన అంతరిక్ష రాకెట్‌కు చెందిన ఇంధన ట్యాంక్ అయి ఉండవచ్చని ఏవియేషన్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా ఏవియేషన్‌ నిపుణులు దీన్ని పరీక్షిస్తున్నారు. అయితే కొందరు మాత్రం దాదాపు పదేళ్ల కిందట కనిపించకుండా మలేషియా ప్రయాణికుల విమానం ఎంహెచ్370లో భాగమని అంటున్నారు. 2014 మార్చి 8న మలేషియా రాజధాని కౌలలంపూర్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరిన ఎంహెచ్370 టేకాఫ్ అయిన గంటకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఇది ఆస్ట్రేలియా తీరంలో కూలిపోయినట్టు తర్వాత గుర్తించారు. ఇది అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విమానంలోని సిబ్బంది సహా 239 మంది చనిపోయారు. ఇప్పుడు దొరికిన శకలం దానికి సంబంధించిందే అనే వాదనలు కూడా విపినిస్తున్నాయి. అయితే ఈ వస్తువు ఏంటి అన్నది మాత్రం తేలాల్సి ఉంది.