Sharmila: జెండా ఎత్తేయనున్న షర్మిల.. కాంగ్రెస్‌లో పార్టీ విలీనం ఖాయం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయ్. పొత్తులు, ఎత్తులు.. విభేదాలు, విలీనాలు.. అన్నీ తెరపైకి వస్తున్నాయ్ ఇలా ! ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో కనిపిస్తున్న కాంగ్రెస్‌.. ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దని ఫిక్స్ అయింది.

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 05:03 PM IST

ఓ మెట్టు దిగేందుకు సిద్ధంగా ఉన్నా.. వెళ్లిన వాళ్లు రావాలి అని రేవంత్ అన్న మాటకు ఒకరకంగా అర్థం అదే ! ఇదంతా ఒకెత్తు అయితే.. వైటీపీ అంటూ పార్టీ మొదలుపెట్టిన షర్మిల.. కాంగ్రెస్‌తో కలవబోతున్నారని.. కాంగ్రెస్‌లో పార్టీని కలిపేయబోతున్నారని రకరకాల చర్చ జరిగింది. షర్మిల ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినా.. సీన్ మాత్రం వేరే అనే చర్చ జరిగింది. ఈ విలీనం వ్యవహారంలో.. ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది.

వైటీపీని.. కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల అంగీకరించారనే ప్రచారం.. తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత.. డీకే శివకుమార్‌తో షర్మిల వరుసగా రెండుసార్లు భేటీ అయ్యారు. అప్పుడే విలీనానికి సంబంధించి చర్చ మొదలైంది. డీకేతో పాటు.. వైఎస్‌ కుటుంబానికి ఆప్తుడు అయిన కేవీపీ రామచంద్రరావుతోనూ షర్మిల వరుస సమావేశాలు నిర్వహించారు. డీకే శివకుమారు, కేవీపీ వ్యూహం ఫలించడంతో.. కాంగ్రెస్‌లోకి షర్మిలకు రూట్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది.

కేవీపీ సలహా మేరకే కాంగ్రెస్‌లో చేరేందుకు షర్మిల అంగీకరించారని తెలుస్తోంది. ఇక అటు షర్మిల ప్రధాన డిమాండ్లకు… కాంగ్రెస్ పెద్దలు కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల మొదటి నుంచి చెప్తున్నారు. కాంగ్రెస్‌ పెద్దలతోనూ అదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది. దానికి హస్తం పార్టీ పెద్దలు కూడా అంగీకరించారని.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేయడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసేందుకు రంగం సిద్ధం అయిందనే ప్రచారం.. వైటీపీ శ్రేణుల్లోనూ ఉత్సాహం నింపుతోంది.

నిజానికి పార్టీ పెట్టిన మాటే కానీ.. షర్మిల ఏ విషయం కలిసి రాలేదు. వైఎస్ మీద అభిమానంతో కీలక నేతలా వచ్చి పార్టీలో చేరుతారు అనుకుంటే.. అది జరగకపోతే.. ఇక్కడి నుంచి జంపింగ్‌లు మొదలయ్యాయ్. వేలకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా.. పొలిటికల్ బజ్ క్రియేట్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య.. పార్టీని కాంగ్రెస్‌లో కలిపేందుకు షర్మిల సిద్ధం కావడం.. వైటీపీలోనే సంబరాలు తెస్తోంది.