సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడ్డక, డిసెంబర్ 22 నే రిలీజ్ చేయటానికి ముచ్చటగా మూడు కారణాలు ఎదురు పడ్డాయట. లేదంటే ఈ సినిమా దీపావళి, కాదంటే సంక్రాంతి, ఇంకో మాట చెప్పాల్సి వస్తే వేసవకి వాయిదా పడాలి.. అలా జరక్క పోవటానికి డిసెంబర్ 22 నే రావటానికి మూడు బలమైన కారణాలున్నాయి. మొదటి కారణం ప్రభాస్ హెల్త్ కండీషన్ .. తనకి రీసెంట్ గా మోకాలి సర్జరీ జరిగింది. సో దీపావలికే సలార్ రిలీజ్ అంటే ప్రమోషన్ కోసం ప్రభాస్ రావాలి.. దేశవ్యాప్తంగా జర్నీ చేయాలి.. అది రెబల్ స్టార్ ప్రజెంట్ పరిస్థితి ప్రకారం సాధ్యం కాదు.
ఇక డిసెంబర్ 22 నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటానికి రెండో కారణం, డిసెంబర్ లో డంకీ మూవీ వస్తోంది.. ఆక్వామ్యాన్ 2 వస్తోంది. వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తులు, సలార్ ని డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తులు సేమ్ కాదట. సో నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా డిసెంబర్ 22 కి ఎలాంటి అబ్జెక్షన్ లేదట. ఇక ఈ సినిమా రిలీజ్ క్రిస్మస్ కే పెట్టుకోవటానికి మరో మూడో బలమైన కారణం, దీపావళికి టైగర్ 3 ని రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్లు సలార్ రైట్స్ కొనటంతో, తమకి ఇబ్బంది వద్దని టపాసుల పండగ వద్దని క్రిస్మస్ ని ఫిక్స్ చేశారు. అంతేకాదు షారుఖ్ మూవీ డంకీకి నార్త్ బెల్ట్ లో 40శాతం థియేటర్లు, సలార్ కి 60శాతం థియేటర్లు దక్కాయట. సో సంక్రాంతి, సమ్మర్ కి సౌత్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఇబ్బందులు వచ్చేఛాన్స్ ఉంది కాబట్టే, కరెక్ట్ ముహుర్తం డిసెంబర్ 22 నే అని ఫిక్స్ చేసింది సినిమాటీం
అంతేకాదు సలార్ సమ్మర్ కి వస్తే అప్పడు కల్కీ మే 9 కే అనుకున్నారు కాబట్టి, దాన్ని వాయిదా వేయాల్సి వచ్చేంది. మారుతీ మేకింగ్ లో తెరకెక్కుతున్న సినిమాకూడా మరో ఏడాదికి వాయిదా పడేది.. సో ఎలా చూసినా ఈ కారనాలతోనే సలార్ ని డిసెంబర్ 22 కి ఫిక్స్ చేశారట.