తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి సెల్ ఫోన్ నెట్వర్క్ పనిచేయకుండా పోయింది. అయితే ఇది అందరికీ జరుగుతుందా అంటే కాదు కేవలం కొందరికి మాత్రమే ఇలా జరుగుతూ వస్తుంది. దీంతో సెల్ ఫోన్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవ్వాల్సి వచ్చింది. కాల్స్ రాకుండానే కాల్ డ్రాప్ పడుతుండటంతో కాలర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఇంచు మించు అన్ని నెట్వర్కులకు చెందిన సెల్ ఫోన్స్ ఇలాంటి వింత సమస్యను ఎదర్కోవల్సి వచ్చింది.
గత వారం ఇలా జరిగి ఉంటే ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సిగ్నల్స్ సమస్యగా పరిగణించి ఉండవచ్చు. ఇప్పుడు ఇలా జరుగుతుండటం పై తీవ్ర ఆందోళన చెందుతున్నారు మొబైల్ వాడకం దారులు. దీనిపై సెల్ ఫోన్ నెట్వర్క్ యాజమాన్యాలు మాత్రం ఇంకా స్పందించలేదు. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయా అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది.
T.V.SRIKAR