ఏపీ కేబినేట్ నిర్ణయాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఎస్ ఈ బీ ని రద్దు చేసి ఎక్సైజ్ శాఖ ను పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 01:57 PM IST

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఎస్ ఈ బీ ని రద్దు చేసి ఎక్సైజ్ శాఖ ను పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంశాల వారీగా అజెండా ఐటమ్స్ కు ఆమోదం తెలుపుతుంది మంత్రి వర్గం. 21.86 లక్షల పట్టాదారు పాసుపుస్తకాల పై కొత్త గా ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 77 లక్షల సర్వే రాళ్ళ పై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

22 ఏ, ఫ్రీ హోల్డ్ భూములు వివాదాల పై రెవెన్యూ సదస్సులు నిర్వహణ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివాదాల లో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేతకు సమ్మతి తెలిపింది ప్రభుత్వం. కొత్త గా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ -పోస్ మిషన్ ల కొనుగోలుకు 11.51 కోట్ల రూపాయల నిధులు విడుదల కు కేబినెట్ ఆమోదం తెలిపింది.